జీవన్‌రెడ్డి ఓటమి పాలు: జగిత్యాల

జీవన్‌రెడ్డి ఓటమి పాలు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి జగిత్యాలలో ఓటమి పాలయ్యారు. తెరాస అభ్యర్థి సంజయ్‌ కుమార్‌ చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో జీవన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైన సంజయ్‌కుమార్‌ ఈ సారి ఆయనపై విజయం సాధించారు. దీంతో జీవన్‌రెడ్డి విజయాల పరంపరకు బ్రేక్‌ పడింది. ఆయన ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు.

 

1989, 1996(ఉపఎన్నికలు), 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఎన్టీఆర్‌, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిల మంత్రివర్గాల్లో మంత్రిగానూ పనిచేశారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 12 స్థానాలను తెరాస గెలుచుకున్నప్పటికీ జగిత్యాలలో మాత్రం జీవన్‌రెడ్డి విజయం సాధించడం విశేషం.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*