టీడీపీ ఎంపీ సీయం ర‌మేష్ ఇంట్లో ఐటీ దాడులు…దొరికిన అవినీతి కాంట్రాక్టులు

ఏపీలో అధికార‌పార్టీ అయిన టీడీపీకి మ‌రో పెద్ద దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టికే ఏపీలో వ‌రుస‌గా ఐటీ దాడులు జ‌రుగుతుండ‌గా.. ఇప్పుడు తాజాగా టీడీపీ ఎంపీ సీయం ర‌మేష్ ఇంట్లో ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. ఏక‌కాలంలో ఆయ‌న ఇంటితో పాటు.. ఆయ‌న‌కు సంబంధించిన కార్యాల‌యాల్లో కూడా దాడులు జ‌రుగుతున్నాయి. ఈ ఐటీ శాఖ‌నుండి మూడురోజుల క్రిత‌మే సీయం ర‌మేష్‌కు ముంద‌స్తు నోటీసులు జారీ చేసింద‌ని స‌మాచారం.

ఇక ఐటీ శాఖ దాడుల‌కు త‌గిన కార‌ణాలు ఏంటంటే.. ఏపీ స‌ర్కార్ నుండి ఈ ఎంపీకు చెందిన కంపెనీలు అనేక కాంట్రాక్టులు ద‌క్కించుకున్నార‌ని.. అంతేకాకుండా ప‌లు కంపెనీ కాంట్రాక్టుల్లో భారీగా అవినీతికి పాల్ప‌డ్డార‌ని స‌మాచారం. అంతే కాకుండా సీయం ర‌మేష్ చూపించిన లెక్క‌ల‌కు, ఆయ‌న ఆదాయానికి క‌రెక్టు లెక్క స‌రిపోవ‌డంలేద‌ని.. ఈ నేప‌ధ్యంలో ఐటీ శాఖ సీయం ర‌మేష్‌కు ముంద‌స్తు నోటీసులు జారీ చేసి సోదాలు నిర్వ‌హిస్తోంద‌ని స‌మాచారం. ఇక మునుముందు ఏపీలో అనేక మంది బ‌డాబాబుల ఇళ్ళ‌ళ్ళో ఐటీ దాడులు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఐటీ శాఖ అధికారులు చెప్పిన‌ట్టు స‌మాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*