గన్నవరం నుంచి సింగపూర్ కి ఎగిరిన తొలి అంతర్జాతీయ విమానం

గన్నవరం నుంచి సింగపూర్ కి ఎగిరిన తొలి అంతర్జాతీయ విమానం., విజయవాడ ప్రజలు గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తోన్న కల నిజమైంది. గన్నవరం నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. 88 మంది ప్రయాణికులతో కూడిన ఇండిగో విమానం మంగళవారం రాత్రి సింగ్‌పూర్ బయలుదేరింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర పౌరవిమానయాన మంత్రి సురేశ్ ప్రభుతో కలిసి ఈ విమానాన్ని ప్రారంభించారు. గన్నవరం నుంచి సింగ్‌పూర్‌కు వారానికి రెండుసార్లు సర్వీసులు నడుస్తాయట. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ రవాణాపరంగా అనుసంధానత పెరిగితేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. గన్నవరం విమానాశ్రయం ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టెర్మినల్‌ భవనానికి సైతం ఆయన భూమిపూజ చేశారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకల్లో విజయవాడకు స్థానం దక్కడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయాలలో రూ.611 కోట్లు వెచ్చించి అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయడం ఇదే దేశంలోనే తొలిసారని వివరించారు.  

 

 

కూచిపూడి, కృష్ణా తీరం గొప్పదనం, స్థానిక సౌరభాలు వెదజల్లేలా టెర్మినల్‌ నిర్మాణం జరుగుతుందని ఆయన వివరించారు. అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కోసం సత్వర అనుమతులు వచ్చేలా సంబంధిత కేంద్ర మంత్రులు, అధికారులతో తాను చర్చించినట్టు గుర్తు చేసుకున్నారు. కేంద్రం కృషితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ చూపడం వల్లే అంతర్జాతీయ కల సాకారమైందన్నారు. విమానయాన సంస్థలు ఆసక్తి చూపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వయబులిటీ గ్యాప్‌ఫండ్‌ సమకూర్చడమేనని, అన్నీ ప్రభుత్వాలు ఇలా చేయబోవని, ప్రైవేటురంగం కూడా ముందుకు వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభం కావడం ఇది ఆరంభమేనని, భవిష్యత్తులో మరిన్ని దేశాలకు విస్తారిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

ఇంకా కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై దృష్టి సారించామని, అందుకోసం 65 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్‌ ప్రభు చెప్పారు. నవ్యాంధ్రకు కేంద్రం సహకరిస్తోందని, సింగపూర్‌ సర్వీసు ప్రారంభం ద్వారా రాష్ట్రంలో కొత్త శకం ప్రారంభమైందని వివరించారు. త్వరలో కేంద్రం ఎయిర్‌కార్గో విధానానికి శ్రీకారం చుడుతుందని, ఇది అమల్లోకి వస్తే రైతులు తమ ఉత్పత్తులను పొలాలనుంచే విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కలుగుతుందని వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*