విశాఖలో ‘అరవింద సమేత’ థియేటర్స్ వద్ద ఫాన్స్ పొలిటికల్ వివాదాలు…!

విశాఖలో ‘అరవింద సమేత’ థియేటర్స్ వద్ద ఫాన్స్ వివాదాల ఉద్రిక్తత…! విశాఖ జిల్లా పాయకరావుపేటలో ‘అరవింద సమేత’ సినిమా ప్రదర్శితం అవుతున్న సాయిమహల్‌ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజకీయ వివాదాల కారణంగా ఈ గొడవ జరిగినట్లు సమాచారం. నందమూరి కల్చరల్‌ యూత్‌ అసోసియేషన్ మరియు బాలకృష్ణ ఫ్యాన్స్‌ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీనుకు, అతడి వర్గీయులకు టిక్కెట్లు ఇవ్వక పోవడంతో గొడవ మొదలైంది. వారికి టిక్కెట్లు ఇవ్వొద్దని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే థియేటర్ యాజమాన్యానికి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  వీరిద్దరూ కొన్ని రోజులుగా తెలుగు దేశం పార్టీ కార్యకలాపాలకు ఏం పట్టనట్లు దూరంగా ఉంటున్నారని టికెట్లు ఆపేశారని తెలుస్తోంది.

 

అయితే ఎందుకనని విచారించగా విశ్వనాధుల శ్రీను ఇటీవల వైసీపీలో చేరారని, ఈ కారణంగానే వారికి టిక్కెట్లు ఇవ్వొద్దని చెప్పినట్లు చర్చించుకుంటున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన వారు, థియేటర్ ముందు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లను చించివేసి నిరసన తెలిపారు. తాను ఏ పార్టీలో ఉన్నా నందమూరి హీరోల అభిమానులమే అని, తమ అభిమానానికి రాజకీయ రంగుపులమడం సరికాదన్నారు. ఈ గొడవ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. మరో వైపు ‘అరవింద సమేత’ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

అమెరికాలో ప్రీమియర్ షోల దగ్గర నుండి తెలుగు రాష్ట్రాల్లో బెనినిఫిట్ షోలు మొదలైనప్పటి నుండే సినిమా మంచి రెస్పాన్స్ వస్తోంది. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం హిట్ అని తేలిపోయింది. మరో వైపు బాక్సాఫీసు వద్ద కూడా రికార్డులు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ఏ ప్రీమియర్ షోల ద్వారా 1 మిలియన్ డాలర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల పైచిలుకు బిజినెస్ చేస్తుందని అంచనా. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*