పోలీస్ జాబ్స్ పార్ట్-2 రిజిస్ట్రేషన్ కు మరో ఛాన్స్:తెలంగాణ

పోలీస్ జాబ్స్ పార్ట్-2 రిజిస్ట్రేషన్ కు తెలంగాణలో మరో ఛాన్స్. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండోదశ (పార్ట్‌-2) పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించినట్టు పోలీసు నియామక బోర్డు ఆదివారం అనగా(నవంబర్‌18) ప్రకటించింది. వాస్తవానికి దరఖాస్తు గడువు ఆదివారం అర్ధరాత్రితోనే ముగిసింది. అయితే నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు ‘పార్ట్-2’ రిజిస్ట్రేషన్ పూర్తిచేయని అభ్యర్థులు నవంబరు 22న ఉదయం 8 గంటల నుంచి నవంబరు 24 అర్ధరాత్రి 12 గంటలకు వరకు రిజిస్ట్రేషన్ పూర్తిచేయవచ్చు. ఈ నిర్ణయంతో ముఖ్యంగా దరఖాస్తుల్లో మార్పుల కోసం చివరి నిమిషంలో అభ్యర్థన పెట్టుకున్న అభ్యర్థులకు ప్రయోజనం చేకూరనుంది.

 

 

 అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా బోర్డు కోరింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ప్రాథమిక పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో అర్హత పొందిన వారికి డిసెంబరు 17 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. అయితే ప్రిలిమినరీ పరీక్ష కోసం సమర్పించిన దరఖాస్తుల్లో తప్పులు దొర్లాయని వందలాది మంది అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందాయి.

ఈ ఫిర్యాదులపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు అభ్యర్థులకు సంబంధించిన ధ్రువపత్రాలు పరిశీలించి.. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో అవసరమైన మార్పులు చేశారు. దీనివల్ల కొందరు అర్హత కోల్పోయారు. ఆ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లోనూ పొందుపరిచారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పరీక్ష దరఖాస్తు గడువు మూడు రోజులు అవకాశం కల్పించారట.

 Website

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*