రాజకీయాల నుంచి తప్పుకుంటా! ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ ప్రకటన

 

తాను  రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఆర్టీసీ చైర్మన్, అధికార పార్టీకి చెందిన రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం గోదావరిఖనిలోని ఐదో గని గేటు మీటింగ్‌లో కార్మికుల సమావేశంలో, జగిత్యాల లో విలేకరులతో మాట్లాడుతూ 15 ఏళ్లు రాజకీయంలో ఉన్నా.. అభివృద్ధికి ఎంతో కృషి చేశా.. కానీ నియోజకవర్గంలో మాత్రం ఇమడ లేకపోతున్నా’’అని సత్యనారాయణ అన్నారు. రామగుండం మేయర్‌పై అవిశ్వాసం ఆపేయాలని అధిష్టానం నుంచి ఫోన్‌ వచ్చిన 24 గంటల్లోపు సోమారపు ఈ నిర్ణయం తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది.          

తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా.. టీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ఎవరు నిలబడినా గెలుస్తారని, వారికి అండగా ఉంటానని చెప్పారు. తాను రాజ కీయ సన్యాసం తీసుకున్నందున ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతానని సత్యనారాయణ అన్నారు.

కాగా మేయర్‌పై పెట్టిన అవిశ్వాసంపై వెనక్కి తగ్గేది లేదని టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు స్పష్టం చేశారు. 50 మందికి గాను మేయర్, డిప్యూటి మేయర్‌లు పోనూ, 48 మంది కార్పొరేటర్లలో 41 మంది అవిశ్వాసానికి మద్దతునిస్తున్నారని పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ సత్యప్రసాద్‌ తదితరులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*