పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు  

పంచాయితీ ఎన్నికలకు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్., హైకోర్టు  పంచాయితీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో మరోసారి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. దీని మీద హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం చెప్తేనే తాము ఎన్నికలు నిర్వహించగలమని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తెలిపింది. ఈ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

 

 

జనవరి 10లోగా ఎన్నికలు నిర్వహించాలని ఇది వరకే హైకోర్టు స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. నిజానికి పంచాయితీ పాలక వర్గాల గడువు ఈ ఏడాది ఆగస్టుతోనే ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. పంచాయితీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కేటాయింపు గరిష్ఠంగా 50 శాతానికి మించడానికి వీల్లేదని ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

 

ఇదిలా ఉంటే రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని, గతంలో రిజర్వేషన్లు ఉండకూడదని ఇటీవలే సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. కాగా, ఇప్పటికే గ్రామపంచాయితీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు ప్రయత్నించినా, ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్ల అంశాలను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో నిలిచిపోయాయి.

 

 

ఈ విధంగా వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడునెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టంచేస్తూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనవరి 10లోగా పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసి, పాలకవర్గాలకు బాధ్యతలను అప్పగించాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 13 నుంచి 14 వరకు గ్రామాల్లో బీసీ ఓటర్ల జాబితాను ప్రచురించాలని పంచాయతీరాజ్‌శాఖ నిర్ణయించిందని సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*