విజయ్ దేవరకొండకు అమ్మాయిలో కావలసిన క్వాలిటీస్.. తెలుసుకుంటారా….!

విజయ్ దేవరకొండకు అమ్మాయిలో కావలసిన క్వాలిటీస్.. తెలుసుకుంటారా….! టాలీవుడ్ తాజా సంచలనం విజయ్ దేవరకొండ. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తాడు. విషయం ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడేస్తాడు. అరడుగుల ఎత్తు కళ్లల్లో తెలీని ఆకర్షణ దయ కలిగిన మనసు కాస్త సరదాగా మరికాస్త సీరియస్ గా ఉండే దేవరకొండకు అదనంగా స్టార్ హీరో స్టేటస్. అలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి మాత్రం కాదంటుంది?

అందుకే ఇప్పటి అమ్మాయిలకు అతడో డ్రీమ్ బాయ్ గా మారాడు. అతడి గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అమ్మాయిల్లో తెగ వ్యక్తమవుతోంది. తన పెళ్లి గురించి తాజాగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. తాను 40 ఏళ్లు వచ్చే వరకూ పెళ్లి చేసుకోకూడదని అనుకున్నానని ఇప్పుడు మాత్రం 35 దగ్గర చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు. భవిష్యత్తులో 30 వరకూ తగ్గినా తగ్గొచ్చని అయితే అదంతా తనకు నచ్చే అమ్మాయి మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పాడు. 

ఎంత ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే అంత హ్యాపీగా ఉంటాం కదా అంటూ తొందరపడి పెళ్లి చేసుకొని ఏం చేయాలి? అంటూ ప్రశ్నిస్తున్న అతగాడు అందుకే తాను ఫార్టీల్లో పెళ్లి చేసుకోవాలనుకున్న విషయాన్ని ప్రస్తావించాడు. పెద్దలు కుదర్చిన పెళ్లి తనకు నచ్చదని ప్రేమ వివాహానికే తాను ఓటు వేస్తానని చెప్పాడు. ప్రస్తుతానికి అయితే ఏ అమ్మాయి మనసులో లేదని స్పష్టం చేశాడు. 

లవ్ విషయంలో కాస్త టైం చూసుకొని సెట్ చేసుకుంటానన్న అతడు తనకు తెలంగాణ ఆంధ్రా అన్న తేడా లేదన్నాడు. ప్రపంచంలో నచ్చిన అమ్మాయి ఎక్కడ ఉన్నా తాను చేసుకుంటానని చెబుతున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా.. ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినా తనకు నచ్చితే చాలన్నాడు. తన మైండ్ సెట్ కు కనెక్ట్ అయితే సరిపోతుందని చెప్పాడు. 

తన జీవితంలోకి వచ్చే అమ్మాయికి సంబంధించి కొన్ని క్వాలిటీస్ ఉండాలంటూ ఆ వివరాల్ని వెల్లడించారు. తన జీవితంలోకి వచ్చే అమ్మాయి కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఒక కనెక్షన్ ఉండాలన్న దేవరకొండ ఏ పని లేకుండా ఇద్దరమే ఒక రూంలో ఉన్నా బోర్ కొట్టకూడదని ఇద్దరం ఏదో ఒకటి మాట్లాడుకోవాలని సరదాగా నవ్వుకోవాలని కలిసి ట్రావెల్ చేయాలని ఇలా ఎంజాయ్ చేయగలగాలంటూ భారీ లిస్టే విప్పాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే 35 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలన్న కండిషన్ ను పక్కన పెట్టేస్తానన్నాడు. అంతా బాగానే ఉంది కానీ.. క్వాలిటీస్ లిస్టు భారీగానే ఉందే దేవరకొండ!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*