నమ్మకం తోనే 24 సార్లు పెట్టేశా అంటున్న హెబ్బా……..

తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం అయిన హెబ్బా పటేల్ కుమారి 21F మూవీతో కుర్రాళ్ల మనసును మెప్పించిన కథానాయిక. తన అందం  గ్లామర్ ను కలగలిపిన హెబ్బా నటనను చూసి అందరూ ఫిదా అయ్యారు. చలాకీదనంతో ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ఈమెకు ఆ తర్వాత అవకాశాలు లేక పొయ్యాయి. కుమారి 21F సినిమా తర్వాత మళ్లీ ఆ రేఁజ్ లో హిట్ హెబ్బా ఏ సినిమా అందుకోలేకపోయింది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మనముందుకు వస్తుంది.

అదీ కుర్రాళ్లకు కాకపుట్టించే క్యారెక్టర్ తో అదిత్ అరుణ్ హీరోగా నటిస్తున్న 24 కిసెస్ సినిమా లో హీరోయిన్ గా హెబ్బా పటేల్ నటిస్తుందట. ఇందులో ఫ్రొఫెసర్ తో ప్రేమలో పడే మీడియా స్టూడెంట్ గా నటిస్తోందట. సినిమా పేరులో చెప్పినట్లే ఇందులో మొత్తం 24 లిప్ లాక్ లను హెబ్బా పెడుతుందట. ప్రతి ముద్దుకు ఓ లెక్క కారణం ఉందట. ఇంత రొమాంటిక్ పాత్రను తాను చేయగలనా లేదా అని హెబ్బా మొదట్లో ఫీల్ అయ్యిందట కానీ కథ మొత్తం విన్నాక నమ్మకం కుదిరాకే ఈ సినిమాలో నటించి ముద్దులతో మురిపించింది. సినిమాకు పెట్టిన టైటిల్ ను బట్టి హీరో హీరోయిన్ల మధ్య 24 ముద్దులు ఓ సందర్భానుసారం వస్తాయట. 

ఎంతో సృజానాత్మకంగా ఈ ముద్దు సీన్లు తీశామని చిత్రం యూనిట్ చెబుతోంది.ఇంతకుముందు చేసిన సినిమాల్లోనూ హెబ్బా ముద్దు సీన్లు చేసినా ఈ సినిమాలో మాత్రం కథ డిమాండ్ చెసేసరికి  ఈజీగా చేసేసిందట సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే ఇక ముందు కూడా చేయడానికి రెడీ అంటోంది హెబ్బా.  ఈ 24 కిసెస్ సినిమాతో మళ్లీ ఆ క్రేజ్ ను తిరిగి తెచ్చుకుంటానని నమ్మకంతో ఉంది. ఇక మిణుగురులు లాంటి క్లాసిక్ మూవీతో జాతీయ అవార్డు పొందిన అయోధ్య కుమార్ 24 కిసెస్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హెబ్బా క్రేజ్ ని తిరిగి తెస్తుందేమో చూడాలి మరి.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*