బొప్పాయి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

బొప్పాయి పండులో పోషకాలూ మరియు విటమిన్స్ పుష్కలంగానే ఉంటాయి.బొప్పాయి లో కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటాకెరోటిన్ ఇందులో ఉంటాయి. విటమిన్ సి మరియు డి సమృద్ధిగా ఉంటాయి. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది.మలబద్దకాన్నితొలగిస్తుంది. బొప్పాయి పండు వల్ల రక్తప్రసరణం బాగా జరుగుతుంది.హృదయానికి ఎంతో మేలు చేస్తుంది.బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి తినిపిస్తే చిన్నారుల కడుపులో ఉండే నులి పురుగులు నశిస్తాయి. బొప్పాయి ఆకులు మెత్తగా దంచి, పసుపుతో కలిపి పట్టు వేస్తే బోదకాలు తగ్గుతుంది.

రోగ నిరోధక శక్తి

ఒక్క కప్ బొప్పాయి ముక్కులు లో  60 నుంచి 126 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అందుకే ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చిగుళ్లవాపును, రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ పండులో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా లభించే మొత్తంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.

జీర్ణ క్రియ

బొప్పాయికాయలో పపేయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మాంసాహారం త్వరగా అరగడానికి దోహదం చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మాంసాహారం వండేటప్పుడు త్వరగా ఉడకడానికి బొప్పాయి కాయ ముక్కలను వేస్తారు.ఇది ఆడవాళ్ళ కి బాగా ఉపయెగపడుతుంది.

నీళ్ళ విరేచనాలు తగ్గిస్తుంది

నీళ్ల విరేచనాలకు బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది. కడుపునొప్పితో నీళ్ల విరేచనాలు మొదలైతే బొప్పాయితో నయం చేయవచ్చు. అందుకోసం బొప్పాయి ని పంచదారతో కలిపి తింటే వాటితో పాటు కొద్దిగా నిమ్మరసం తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. అంతేగాకుండా పైల్స్ నివారణకు పచ్చి బొప్పాయికాయ కూర బాగా ఉపయోగపడుతుంది.

బీపిని తగ్గిస్తుంది

రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అంతేగాకుండా కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బొప్పాయి వేరును అరగదీసి నీటిలో కలిపి దాహం అనిపించినప్పుడల్లా తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు మాయమవుతాయి.
బాలింతలకు బొప్పాయి ముక్కలను పాలతో కలిపి బ్రేక్‌ఫాస్టుగా తీసుకుంటే బాలింతలకు స్తన్యం ఎక్కువగా వస్తుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*