సిద్ధిపేట లో రికార్డు బ్రేక్‌ చేస్తున్న హరీష్‌ రావు

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీకి కేరాఫ్‌ అడ్రస్‌ ఆపద్ధర్మ మంత్రి, సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీష్‌ రావు. తాజా ఎన్నికల ఫలితాల్లో సైతం ఆయన మరోసారి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో  93,328 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీ సాధించిన హరీష్‌ రావు ఈ సారి కూడా ఆ రికార్డు బ్రేక్‌ చేసేలా ఉన్నారు. ఆరు రౌండ్లు కౌంటింగ్‌ ముగిసే సరికే హరీష్‌ రావు 39,606 ఓట్ల ఆధిక్యం సాధించారు. ప్రజాకూటమి తరఫున బరిలోకి దిగిన భవాని రెడ్డి ఏమాత్రం పోటీనివ్వలేకపోయారు. ఇప్పటికే ఇక్కడి నుంచి ఐదు సార్లు ఘనవిజయం సాధించిన హరీష్‌రావు ఆరోసారి కూడా భారీ ఆధిక్యం సాధించనున్నారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*