రేవంత్ రెడ్డి అరెస్ట్ తో…. భార్య సంచలన వాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో తాజాగా కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్‌తో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ రోజు వికారాబాద్ జిల్లాలోని కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కోస్గీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బ‌హిరంగస‌భ ఉండ‌డంతో, కేసీఆర్‌ను కొడంగల్‌లో అడుగుపెట్ట‌నివ్వ‌మ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. దీంతో అక్క‌డ ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా.. తెల్ల‌వారు జామున రేవంత్ రెడ్డితో పాటు ఆయ‌న అనుచ‌రుల‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇక రేవంత్ రెడ్డి అరెస్టు పై ఆయ‌న భార్య గీత‌ స్పందించారు. అర్ధ‌రాత్రి త‌లుపులు బ‌ద్ద‌లుకొట్టి మ‌రీ రేవంత్‌ను బ‌ల‌వంతంగా తీసుకెళ్ళార‌ని.. త‌న భ‌ర్త‌ను ఓ టెర్ర‌రిస్టులాగా ఈడ్చుకెళ్ళార‌ని రేవంత్ భార్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.ప్ర‌స్తుత ప‌రిస్థితులు, జ‌రిగిన సంఘ‌ట‌న చూస్తే.. తన భర్తకు ప్రాణహానీ ఉందని…పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక తమ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఊరుకునేది లేదని రేవంత్ భార్య మండిప‌డ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు సంయమనం కోల్పోవద్దని, ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డొద్ద‌ని, రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించి, కేసీఆర్‌కు త‌గిన బుద్ది చెప్పాల‌ని గీత పిలుపునిచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*