‘గీత గోవిందం’ సినిమా రివ్యూ మరియు రేటింగ్

సినిమా పేరు: గీత గోవిందం

జానర్ : రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌

నటి నటులు : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ

దర్శకత్వం : పరశురామ్‌

నిర్మాత : బన్నీ వాస్‌

సంగీతం : గోపి సుందర్‌

 

అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిన విజయ్‌ దేవరకొండ… మరో డిఫరెంట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అర్జున్‌ రెడ్డి లాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ తరువాత ఓ డీసెంట్‌  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరి తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా విజయ్‌ చేసిన గీత గోవిందం  ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది…? గీత గోవిందుల ప్రేమ కథ ఏంటి..?

 కథ..

విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్. సంస్కారవంతుడు.. సంప్రదాయాలు, పద్ధతులు, విలువలు తెలిసిన వ్యక్తి. తనకు రాబోయే భార్య గురించి గొప్పగా ఊహించుకుంటూ ఉంటాడు. ఆ ఊహల్లోనే బతుకుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలో గీత (రష్మిక మందన్న) గోవింద్ కంటబడుతుంది. తన ఊహల్లో ఉన్న అమ్మాయి తనే అని గోవింద్ ఫిక్స్ అయిపోతాడు. ఎలాగైనా తన ప్రేమను ఆమెకు చెప్పాలనుకుంటాడు. అయితే అనుకోని సంఘటన ఒకటి జరగడంతో గోవింద్‌పై రష్మికకు దురాభిప్రాయం ఏర్పడుతుంది. అతన్ని అసహ్యించుకుంటుంది. కానీ అతనితోనే కలసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. మరి ఈ ప్రయాణంలో ఏం జరిగింది? అసలు గోవింద్‌తో గీత ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది? అనుకోకుండా జరిగిన ఆ సంఘటన ఏమిటి? చివరికి వీళ్లిద్దరూ కలిశారా? అనే ప్రశ్నలకు సినిమానే సమాధానం. 

ఎవరెలా చేశారంటే.. 

సినిమాకు ప్రధాన బలం విజయ్ దేవరకొండ. ఆయన మేనరిజం, కామెడీ టైమింగ్ అద్భుతమనే చెప్పాలి. నిజానికి పరశురాం డైలాగులు చాలా సహజంగా, అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. కొంచెం మసాలా కూడా ఉంటుంది. ఆ డైలాగులను విజయ్ మరింత ఎఫెక్టివ్‌గా చెప్పారు. ఇక ఎప్పుడూ కోపంగా, చిరాకుగా ఉండే అమ్మాయి పాత్రలో రష్మిక జీవించేసింది. ఎమోషనల్ సీన్స్‌లో ఏడిపించేసింది. మొత్తంగా గోవింద్‌తో మంచి కెమిస్ట్రీని పండిచింది. ప్రత్యేక పాత్రలో కనిపించిన నిత్యా మీనన్ ఎప్పటిలానే సహజమైన నటనతో ఆకట్టుకుంది. రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ కామెడీ బాగా నవ్విస్తుంది. సుబ్బరాజు, నాగబాబు, అన్నపూర్ణ, గిరిబాబు, అభి తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సుబ్బరాజుకు చాలా కాలం తరవాత పూర్తిస్థాయి పాత్ర దొరికింది. 

చివరిగా..

తిడితే పడాలి, కొడితే భరించాలి, జీవితాంతం ఓపికగా భార్య చెప్పింది వినాలి.. ఇలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు కోరుకుంటారట. మీరూ సినిమా చూసి చెప్పండి. రెండున్నర గంటల హాయిగా నవ్వుకోండి. 

 

web2look రేటింగ్ : 3.5/5

 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*