టీవీల్లోనూ.. సామజిక మాధ్యమాల్లోనూ.. మీ కేసీఆర్‌…!

టీవీల్లోనూ.. సామజిక మాధ్యమాల్లోనూ.. మీ కేసీఆర్‌…!‘నేను మీ కేసీఆర్‌ను’ 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణను సాధించి, మీ ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపాం. సంక్షేమానికి కృషి చేశాం. మళ్లీ ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాం. మరోమారు ఆశీర్వదించండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని ప్రసారమాధ్యమాల్లో కనిపించనున్నారట. కేసీఆరే తమ ఎన్నికల నినాదమని తెరాస నేతలు చెబుతున్నారు. దీనికి వీలుగా గత అయిదు రోజుల్లో పదికి పైగా సందేశాలను సీఎంపై చిత్రీకరించినట్లు తెలిసింది. మూడు, అయిదు నిముషాల నిడివితో ఇవి ఉన్నాయి. సీఎం ప్రారంభ పలుకులతో మొదలై రైతుబంధు, పింఛన్లు, నిరంతర విద్యుత్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్లు, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, కాకతీయ, గొర్రెలు, చేపల పెంపకం తదితర పథకాల గురించి ఆయన వివరిస్తున్నట్లు సమాచారం.

 

 త్వరలోనే వీటిని విడుదల చేయనున్నారు. టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాలతోపాటు ఎన్నికల ప్రచార సభల్లోనూ వీటిని వాడుకోనున్నారు.  సీఎం కేసీఆర్‌ గురువారం గజ్వేల్‌ నియోజకవర్గ నేతలతో సమావేశమై ఎన్నికల ప్రచారం, ఇతర అంశాలపై చర్చించారు. కేసీఆర్‌ ప్రచార సభల షెడ్యూలును ఒకటి, రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు. వరంగల్‌ లేదా మరో జిల్లా నుంచి తదుపరి సభలను నియోజకవర్గాల వారీగా నిర్వహించే వీలుందని సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*