మొదలైన ఎస్సై పోస్టుల దరఖాస్తు ప్రక్రియ(APSLPRB Recruitment 2018)

 

 

మొదలైన ఎస్సై పోస్టుల దరఖాస్తు ప్రక్రియ, ఆంధ్రప్రదేశ్‌లో 3,137 పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గతవారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే వీటిలో 334 ఎస్సై పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా సోమవారం (నవంబరు 5) సాయంత్రం ఎస్సై పోస్టుల దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), దేహదారుఢ్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నవంబరు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

పోస్టులు పోస్టుల సంఖ్య
ఎస్‌సీటీ ఎస్సై (సివిల్) 150
ఎస్‌సీటీ ఆర్‌‌ఎస్సై (ఏఆర్) 75
ఎస్‌సీటీ ఆర్‌‌ఎస్సై(ఏపీఎస్పీ) 75
డిప్యూటీ జైలర్స్ 14
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 20
మొత్తం ఖాళీలు 334

 

నోట్: ఎస్‌సీటీ – స్టైపెండరీ క్యాడెట్ ట్రెయినీ 

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 

 

 

వయోపరిమితి…

 

పోస్టులు వయోపరిమితి (01.07.2018 నాటికి)
ఎస్సై, ఆర్‌ఎస్సై (ఎస్‌సీటీ ) 21 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి. 
02.07.1993 – 01.07.1997 మధ్య జన్మించి ఉండాలి.
డిప్యూటీ జైలర్స్ (మెన్) 21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
02.07.1988 – 01.07.1997 మధ్య జన్మించి ఉండాలి.
డిప్యూటీ జైలర్స్ (ఉమెన్) 21 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి. 
02.07.1993 – 01.07.1997 మధ్య జన్మించి ఉండాలి.
స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ (మెన్) 18 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
02.07.1988 – 01.07.2000 మధ్య జన్మించి ఉండాలి.

 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300. ఏపీ ఆన్‌లైన్, మీసేవా సెంటర్లు క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. 

ఎంపిక విధానం: రాతపరీక్షలు (ప్రిలిమినరీ, మెయిన్స్), దేహదారుఢ్య పరీక్షల ద్వారా. 

పరీక్ష విధానం (ప్రిలిమ్స్)
మొత్తం 200 మార్కులకు ప్రిలిమినరీ రాతపరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 100 మార్కులకు గాను మెంటల్ ఎబిలిటీ (అర్థమెటిక్, రీజనింగ్); పేపర్ -2లో 100 మార్కులకు గాను జనరల్ ఎబిలిటీపై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. ఉ.10.00 గం. – మ.1.00 గం. వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం మ.2.30 గం. – సా.5.30 గం. పేపర్-2 రాతపరీక్ష నిర్వహిస్తారు. 
* ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో కూడా ఉత్తీర్ణులైన వారికి ప్రధాన పరీక్ష నిర్వహిస్తారు. 

ముఖ్యమైన తేదీలు.. 
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.11.2018. 
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.11.2018. 
పరీక్ష తేది: 16.12.2018. 
వెబ్‌సైట్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*