కేసీఆర్ నిర్ణయం మీద ఉద్యోగుల్లో భయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త‌న‌దైన స్టైల్ లో  హామీలను  కీల‌క వ‌ర్గాల్లో భయం సృష్టిస్తున్నారు. పార్టీ అధికారంలోకి  వస్తే  తమ మేనిఫెస్టోలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతామని కేసీఆర్ గారు  అన్నారు. ఇప్పుడు  పార్టీ  అధికారంలోకి  వచ్చింది . మరి ఉద్యోగులు ఎందుకు  భయం  అంటే డిసెంబర్ మాసంలో పదవీ విరమణ చేయాలి . ఉద్యోగుల పదవీ విరమణ వయ్ససును 58 నుండి 60 ఏళ్లకు పెంచాలనే దానిపై ప్రభుత్వం పలు ఆలోచనలు చేసినా అది కార్యరూపం దాల్చలేదు. చివరకు దీనిపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుని..ఎన్నికల సందర్భంగా హామీని ఇచ్చేశారు.డిసెంబర్ 20 నుండి 25వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఈ నెలలో రిటైర్ అయ్యే ఉద్యోగులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది.మరి తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి .

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*