తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ డిసెంబర్‌ 7న పోలింగ్‌

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌పై సస్పెన్స్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. రాజస్థాన్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలంగాణలో డిసెంబర్‌ ఏడో తేదీన పోలింగ్‌ జరగనుం‍ది. ఈ మేరకు తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ ఖరారుపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఓటర్ల జాబితాను ప్రకటించడానికి ఇంకా సమయం ఉందని, ఈ నెల 8న ఓటర్ల తుది జాబితాను ప్రకటించాలని భావించినప్పటికీ.. ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్‌ స్పష్టం చేశారు. అయితే, రాజస్థాన్‌తోపాటే అనూహ్యంగా ఆయన తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు.

తెలంగాణ, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ఈ విధంగా ఉంది..

నవంబర్ 12న నోటిఫికేషన్‌ వెలువడనుంది..

నామినేషన్లు దాఖలు చివరి తేదీ : నవంబర్ 19

నామినేషన్ల పరిశీలన : నవంబర్ 20

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ : నవంబర్ 22

పోలింగ్: డిసెంబర్ 7

కౌంటింగ్: డిసెంబర్ 11

 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*