వాహనాలు నడిపే వాళ్ళు ఇది చూసైనా మారండి

బహదూర్‌పురా: హైదరాబాద్ పాతబస్తీలో అతిదారుణం చోటుచేసుకుంది. బహదూర్‌పురా నాలా వద్ద ఫోన్ మాట్లాడుతూ రాంగ్ రూట్లో వెళ్తున్న ఖాజా మోహినుద్దీన్(35) అనే వ్యక్తి రోడ్డు కి అడ్డంగా వెళ్ళి ప్రమాదం జరిగి బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు. ఇలా ఎలా జరిగింది అంటే ?ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతూ రాంగ్‌రూట్‌‌లో వెళ్తున్న మోహినుద్దీన్‌ను మరో బైక్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన పై బహదూర్‌పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తలకి బాగా బలమైన గాయం తగలడంతో ఖాజా మోహినుద్దీన్ బ్రెయిన్ డెడ్ అయ్యి మృతి చెందాడని.. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై శివకుమార్ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*