‘దేవదాస్’ సినిమా రివ్యూ మరియు రేటింగ్

సినిమా పేరు  :   దేవదాస్

నటి నటులు  :   నాగార్జున, నాని,రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ 

దర్శకత్వం    :   శ్రీరామ్ ఆదిత్య

నిర్మాత        :   అశ్వినీదత్

సంగీతం      :   మణి శర్మ

 

నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ట్రైలర్ , టీజర్స్ ఆకట్టుకోవడం తో సినిమా ఫై అందరిలో భారీ అంచనాలే పెరిగాయి.. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమాను భారీ స్థాయి లో ఈరోజు థియేటర్స్ లలో విడుదల చేసారు.అమెరికా లో అర్ధరాత్రి నుండే ప్రీమియర్స్ షోస్ మొదలు అయ్యాయి.

కథ..

 

దేవ (నాగార్జున‌) ఓ డాన్‌. ప్రాణాలంటే లెక్క‌లేదు. అతి తీయ‌డంలో మ‌జాని ఆస్వాదిస్తాడు. ఎవ్వ‌రికీ క‌నిపించ‌డు. దేవా ఎలా ఉంటాడో ఎవ్వ‌రికీ తెలీదు. దేవాకి వ్య‌తిరేకంగా ఓ ముఠా త‌యార‌వుతుంది. దేవాని ర‌ప్పించ‌డానికి ప‌థ‌కం ప‌న్నుతారు. అందులో భాగంగానే దేవాని పెంచి పెద్ద చేసిన దాదా (శ‌రత్‌కుమార్‌)ని చంపేస్తారు. దాదాని చంపిన‌వాళ్ల‌ని వెదుక్కుంటూ దేవా హైద‌రాబాద్ వ‌స్తాడు. అక్క‌డ పోలీసుల కాల్పుల్లో దేవాకి గాయాల‌వుతాయి. చికిత్స కోసం దాస్ (నాని) ఉన్న ఆసుప‌త్రికి వ‌స్తాడు. దాస్ చాలా మంచోడు. నిజాయ‌తీపరుడు. పేషెంట్‌ని కాపాడ‌డ‌మే త‌న ధ్యేయం అనుకుంటాడు. అందుకే దేవ‌ని కాపాడ‌తాడు. దాసు మంచి మ‌న‌సు దేవ‌కి న‌చ్చుతుంది. అందుకే ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. దాసు కూడా దేవ‌ని ఇష్ట‌ప‌డ‌డం ప్రారంభిస్తాడు. త‌న‌లో ఉన్న మంచిని బ‌య‌ట‌కు తీసి, మార్చాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. మ‌రి ఆ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కూ స‌ఫ‌లీకృత‌మైంది. దేవాని దాసు మార్చాడా, లేదంటే దాసే దావాలా మారిపోయాడా? అనేదే క‌థ‌.

ఎవరెలా చేశారంటే.. 

 

నాగార్జున‌, నాని… వీరిద్ద‌రే ఈ చిత్రానికి ప్రాణం. వాళ్లు లేకుండా `దేవ‌దాస్`ని ఊహించ‌లేం. నాని, నాగ్‌ల‌లో ఎవ‌రు లేక‌పోయినా దేవ‌దాస్‌గురించి మాట్లాడుకోవ‌డం కూడా అన‌వ‌స‌ర‌మే. నాగ్ చాలా గ్లామ‌ర్ గా క‌నిపించాడు. త‌న లుక్ బాగుంది. స్టైల్ బాగుంది. దేవ పాత్ర‌కు మ‌రింత వ‌న్నె తేచ్చేశాడు నాగ్‌. చాలా క్యాజువ‌ల్‌గా క‌నిపించాడు. కాక‌పోతే… `నా కాలేజీ రోజుల్లో` అంటూ చెప్పే ఫ్లాష్ బ్యాక్‌లో మాత్రం నాగ్ విగ్గు, వేష‌ధార‌ణ మ‌రీ కామెడీగా ఉంది. వెనుక బుల్లెట్ల దాడి జ‌రుగుతున్నా.. రొమాంటిక్‌గా ప‌రిగెట్ట‌డం కూడా… నాగ్‌కే చెల్లింది. నాని కామెడీ టైమింగ్ ఈ సినిమాకి బాగా క‌లిసొచ్చింది. యావరేజ్ డైలాగ్‌ని కూడా త‌న టైమింగ్‌తో వేరే రేంజ్‌కి తీసుకెళ్లాడు నాని. వీరిద్ద‌రి కోస‌మైతే ఈ సినిమాని నిర‌భ్యంత‌రంగా చూడొచ్చు. ర‌ష్మిక‌, ఆకాంక్ష‌.. ఇద్ద‌రివీ అతిథి పాత్ర‌లే. ‘గీత గోవిందం’ త‌ర‌వాత ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర‌లో క‌నిపించింది ర‌ష్మిక‌. చిన్న చిన్న పాత్ర‌ల‌కు కూడా బాలు, న‌వీన్ చంద్ర లాంటి పేరున్న న‌టుల్నీ తీసుకున్నారు. కానీ.. ఆ పాత్ర‌లు ఆ స్థాయిలో మాత్రం పేల‌లేదు.

తీర్పు..

 

ఇద్ద‌రు హీరోలు, వాళ్ల‌పై జ‌నాల‌కున్న అంచ‌నాలు… వీటిని `దేవ‌దాస్‌` అందుకోలేక‌పోవొచ్చు. కానీ ఎలాంటి అంచ‌నాలూ లేకుండా ఖాళీ మైండ్‌తో వెళ్తే.. దేవ‌దాస్ ఎంట‌ర్టైన్ చేస్తాడు. ఈవారం `దేవ‌దాస్‌`కి పోటీ లేక‌పోవ‌డం కూడా క‌లిసొచ్చే అంశ‌మే.

Web2look Rating : 3/5

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*