బరువు తగ్గింది అందుకే.. గడ్డం పెంచింది అందుకే.. అంటున్న రానా…..!

దగ్గుబాటి రానా బాహుబలిలో భల్లాల దేవుడి క్యారెక్టర్ లో ఒదిగిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సినిమాలో పొగరున్న కండలవీరుడిగా కనిపించిన రానా, ఆ తర్వాత కొద్దిగా బక్కచిక్కడంతో రకరకాల పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఆరోగ్య సమస్యలతో రానా ఇబ్బంది పడుతున్నాడని పలు రకాల పుకార్లు వస్తునే ఉన్నాయి. సురేష్ బాబు  రానా పలుసార్లు వీటిని ఖండించినా అవి మళ్ళీ మళ్ళీ సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన వెంకీమామ లాంచ్ కు మీడియాను పిలవలేదని  ఆ కార్యక్రమంలో రానా పాల్గొనడమే అందుకు కారణమని ప్రతికూలతలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత సురేష్ బాబు విడుదల చేసిన ముహూర్తపు షాట్ లో మాత్రమే రానా కనిపించాడు. అక్టోబర్ లో హైదరాబాద్ లో సెన్సేషన్ రైజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి సంబంధించి నిన్న జరిగిన వైట్ థీమ్ ఈవెంట్ లో రానాతోపాటు గుత్తా జ్వాలా  కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా రానా మీడియాతో మాట్లాడుతూ తన న్యూ లుక్ పై షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇపుడు ఎందుకు సన్నగా కనిపిస్తున్నారని విలేకరి అడిగిన ప్రశ్నకు రానా ఆసక్తికర సమాధానమిచ్చాడు.

         కొత్త సినిమా కొత్త క్యారెక్టర్ దానిని బట్టి బాడీ పెంచాలని ఒక సినిమా కోసం కండలు పెంచాలని మరో సినిమా కోసం బరువు తగ్గాలని అన్నాడు. 15 రోజుల్లో తన కొత్త క్యారెక్టర్ లుక్ రివీల్ చేస్తానని గుబురు గడ్డం పెంచడం, బరువు తగ్గడం వెనుక ఉన్న సీక్రేట్ గురించి చెబుతానని అన్నాడు. మరలా ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబునాయుడి పాత్రను పోషిస్తున్నారా అని ప్రశ్నిస్తే రానా ఆసక్తికర సమాధానమిచ్చాడు. మీరు ఆ పాత్రలో నన్ను చూడాలనుకుంటున్నారా అయితే ఆ ఛాన్స్ వస్తే తప్పక చేస్తాను అని పరోక్షంగా తాను ఆ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పాడు. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటించడం పై డైరెక్టర్ క్రిష్ అధికారికంగా చెప్పేవరకు వరకు ఈ సస్పెన్స్ కు తెరపడదు అంటున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*