తెరాస పరాజయం ఖాయం:చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మహాకూటమి తరఫున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మరో పక్క కేసీఆర్, కేటీఆర్ మొదలుకొని తెరాస నాయకులంతా చంద్రబాబునే టార్గెట్ చేసి తీరా స్థాయిలో విమర్శిస్తున్నారు. తెలంగాణలో తిరిగే హక్కు బాబుకు లేదంటూ మండి పడుతున్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడంటూ విమర్శిస్తున్నారు. చంద్రబాబు కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తున్నారు, ఒక పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడి హోదాలో తెలంగాణ ప్రచారానికి వస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఎన్ని తిట్టినా ప్రజల సంక్షేమమే తన లక్ష్యం అని, ప్రజల వృద్ధి కోసమే ఏపీని చేస్తా అని అంటున్నారు.

 

 

కేసీఆర్‌ తన కోసం, తన కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే…లక్ష ఉద్యోగాలు, డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షలు వడ్డీలేని రుణం, ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు, కుటుంబానికి ఆరు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు. ఇందుకు రాహుల్‌ గాంధీ, నేను హామీ. పనులు చేయని నాయకులకు విశ్వసనీయతఉండదు. ప్రజాకూటమి దూసుకుపోతుంటే తెరాసకు ఓటమి భయం పట్టుకుంది. ఇవి ప్రజల భవిష్యత్తు మార్చే ఎన్నికలు. ప్రజలంతా ఆలోచించి ఓట్లు వేయాలని కోరుతున్నా’’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*