మైలవరంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన


మైలవరంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన.. పదేళ్ల కడప జిల్లా వాసుల కల నెరవేరింది. దాదాపు లక్ష మందికి ఉపాధినిచ్చే రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు పునాదిరాయి ఈరోజు పడింది. గురువారం ఉదయం మైలవరం మండలం కంబాలదిన్నెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.

అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2700 ఎకరాల్లో రూ.18వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ నిర్మాణం జరుగనుంది. ఈ సందర్బంగా బాబు మాట్లాడుతూ ఈ పరిశ్రమ ఎంతోమందికి ఉపాధినిస్తుందని..  కడప జిల్లా వాసుల కల ఫలించదని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*