ఒంటరి పోరాటానికి రెడీ అంటున్న… చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు పార్టీ ఆవిర్భావ తర్వాత తొలిసారిగి కీల‌క నిర్ణ‌యం తీసుకొని బ‌రిలో దిగుతున్న క్ర‌మంలో ఈ ఆస‌క్తి మొద‌లైంది. అదే ఒంట‌రి పోరు. ఈసారి ఏపీలో మొదటిసారి చంద్ర‌బాబు ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ ఒంటరిపోరు చంద్రబాబుకు కలిసివస్తుందా? లేదా? అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.

కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చంద్రబాబు.. ఆపై తన మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆపై జరిగిన రాజకీయ కీలక పరిణామాలు.. దరిమిలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం పీఠం అధిష్ఠించారు. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎన్టీ రామారావు పార్టీని స్థాపించిన నాటి నుంచి కూడా టీడీపీ ఒంటరిగా పోటీచేయలేదు. పార్టీ బరిలోకి దిగిన తొలి ఎన్నికల్లోనే సంజయ్ విచార్‌మంచ్‌తో పొత్తు పెట్టుకుంది. అప్పటినుంచీ టీడీపీ పొత్తు రాజకీయాలతోనే పబ్బం గడుపుకుంటూ వస్తోంది. టీడీపీ నాయకత్వం ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగలేదు. కానీ తాజాగా ఒంటరి పోరుకు సిద్ధ‌మైంది.

చంద్రబాబు ఆధ్వర్యంలో తొలిసారిగా 1999 ఎన్నికల్లో పోటీచేసిన ఆ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో వాజ్‌పేయి ప్రభతో ఇక్కడ చంద్రబాబు గట్టెక్కారు. ఆపై అలిపిరి ఘటన తర్వాత తనతోపాటు కేంద్రంలోని ఎన్డీయేను కూడా ముందస్తుకు నడిపించి.. బొక్కబోర్లా పడ్డారు. 2004 ఎన్నికల్లో బీజేపీతోనే జట్టుకట్టి పోటీచేసిన ఆయన పరాజయాన్ని మూటగట్టుకున్నారు. తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే 2009 బాబు నేతృత్వంలోని తెలుగుదేశం మహా కూటమితో కలిసి ఎన్నికల్లోకి వెళ్లింది. టీఆర్‌ఎస్, వామపక్షాలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నారు. 2014లో బీజేపీ-జ‌నసేన-టీడీపీ కూట‌మిగా పోటీ చేశాయి. తాజాగా తెలుగుదేశం ఒంట‌రిగా బ‌రిలో దిగుతోంది. ఈ పోరు ఆ పార్టీకి క‌లిసి వస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*