టీఆర్ఎస్‌తో కలిసి జగన్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాడని ఆరోపణ: చంద్రబాబు

టీఆర్ఎస్‌తో కలిసి జగన్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఏకపక్షం కావాలని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. 10లక్షల సైన్యం ఉన్న అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిస్తే 65లక్షల తెలుగు సైన్యం ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా బాబు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 65లక్షల పసుపు సైన్యానికి తోడుగా కోటిమంది అక్కాచెల్లెళ్ల అండ మనకు ఉందని, రైతులు, యువత, పెన్షనర్లు, అండతో 2019 ఎన్నికల్లో అఖండ విజయం ఖాయమైపోయిందన్నారు. రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టులో కేసు వేసిందని, అలాంటి వారితో జగన్ అంటకాగుతున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదన్నారు.

ఇటీవల నేటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది కాబట్టి లబ్ధిదారులంతా టీడీపీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరారు. వైసీపీకి ఓటేస్తే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత ఉండదన్నారు.  వివేకానందరెడ్డిని వైఎస్ జగన్ వేధించాడని, బాబాయిపైనే చేయి చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయని చంద్రబాబు గుర్తుచేశారు. ఎంపీగా రాజీనామా చేయాలని వివేకాను బెదిరించిన జగన్ సోనియా హెచ్చరికతోనే వెనక్కి తగ్గారంటూ వచ్చిన కథనాలను ఆయన ప్రస్తావించారు. వివేకానందరెడ్డి ముందు గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసిన జగన్ గ్యాంగ్ గాయాలు వెలుగులోకి రావడంతో కొత్త నాటకం ప్రారంభించారని ఆరోపించారు. సిట్ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, దోషులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*