కేంద్రమంత్రి  రాజీనామా.. బీజేపీకి షాక్…!

కేంద్రమంత్రి  రాజీనామా.. బీజేపీకి బీజేపీకి షాక్…!పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా ఒక్కరోజు ముందు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి ఇవాళ ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) చీఫ్ ఉపేంద్ర కుశ్వాహ ఎన్డీయే ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇవాళ ఢిల్లీలోజరుగుతున్న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశానికి తాను హాజరు కావడం లేదంటూ కుశ్వాహ చెప్పిన కొద్దిసేపటికే ఆయన ఎన్డీయేలో కొనసాగుతారా, లేదా అన్నదానిపై ఊహాగానాలు వెలువడుతున్నాయి.

 

ఇందులో భాగంగా కుశ్వాహ ఎన్డీయేకి రాజీనామా ప్రకటించడం గమనార్హం. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆర్ఎల్ఎస్పీకి ఒక్క సీటు కంటే ఎక్కువ ఇచ్చేందుకు బీజేపీ తిరస్కరించడంతో కుశ్వాహ ఇటీవల ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

 

మరోవైపు బీహార్‌లో కుశ్వాహ పార్టీకి ఒక్క సీటుకంటే ఎక్కువ ఇవ్వబోమని చెప్పిన కాషాయ పార్టీ సీఎం నితీశ్ సారథ్యంలోని జేడీయూతో మాత్రం సమాన సంఖ్యలో సీట్లు పంచుకోవాలని నిర్ణయించింది. దీంతో తమకు గౌరవనీయ సంఖ్యలో సీట్లు కేటాయించని పక్షంలో 2019 ఎన్నికల్లో ఎన్డీయే మూల్యం చెల్లించక తప్పదని కుశ్వాహ ముందే వ్యాఖ్యానించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*