తాజా వార్తలు

విశాఖలో ‘అరవింద సమేత’ థియేటర్స్ వద్ద ఫాన్స్ పొలిటికల్ వివాదాలు…!

విశాఖలో ‘అరవింద సమేత’ థియేటర్స్ వద్ద ఫాన్స్ వివాదాల ఉద్రిక్తత…! విశాఖ జిల్లా పాయకరావుపేటలో ‘అరవింద సమేత’ సినిమా ప్రదర్శితం అవుతున్న సాయిమహల్‌ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజకీయ వివాదాల కారణంగా ఈ గొడవ జరిగినట్లు సమాచారం. నందమూరి కల్చరల్‌ యూత్‌ అసోసియేషన్ మరియు బాలకృష్ణ ఫ్యాన్స్‌ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీనుకు, అతడి వర్గీయులకు టిక్కెట్లు ఇవ్వక పోవడంతో గొడవ మొదలైంది. వారికి టిక్కెట్లు ఇవ్వొద్దని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే థియేటర్ యాజమాన్యానికి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ...

Read More »

పట్టాలు తప్పి ప్రమాదానికి గురైన ఎక్స్ ప్రెస్.. 7గురు మృతి.. ౩౦మందికి గాయాలు…!

  పట్టాలు తప్పి ప్రమాదానికి గురైన ఎక్స్ ప్రెస్.. 7గురు మృతి.. ౩౦మందికి గాయాలు…! పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా పట్టణం నుంచి న్యూఢిల్లీకి వెళ్లే న్యూఫరక్కా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్‌చందాపూర్ వద్ద బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రైలు పట్టాలు తప్పినట్టు ఉత్తర రైల్వే డివిజనల్ మేనేజర్ సతీష్ కుమార్ వెల్లడించారు. ఇంజిన్ తో సహా ఐదు బోగీలు పట్టాలు తప్పాయని చెప్పారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. 30 మందికి పైగా గాయాల పాలయ్యారు. ...

Read More »

ముంచుకొస్తున్న రెండు సముద్రాల్లో నుంచి రెండు తుఫాన్లు ‘తితలీ’ ‘లుబన్‌’…!

ముంచుకొస్తున్న రెండు సముద్రాల్లో నుంచి రెండు తుఫాన్లు ‘తితలీ’ ‘లుబన్‌’…! రెండు వైపుల నుంచి రెండు సముద్రాల్లో ముంచుకొస్తున్న రెండు తుఫాన్లు పలు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఇటు బంగాళాఖాతం అటు అరేబియా సముద్రం రూపుదిద్దుకున్న ఈ తుఫాన్లు ఏ స్థాయిలో విరుచుకుపడతాయోనని ప్రభావిత ప్రాంతాల ప్రజలు భీతిల్లుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి సోమవారం తూర్పుమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది మరింత బలపడి బుధవారం నాటికి తుఫానుగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో అక్టోబరు 10, 11 ...

Read More »

హద్దులు లేకుండా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు….!

హద్దులు లేకుండా పెరుగుతున్న పెట్రోలు డీజిల్ ధరలు….! ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను మరోసారి సవరించాయి. దీంతో సోమవారం (అక్టోబరు 8) దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 21 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.82.03కి చేరింది. డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ.73.82కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబాయ్ లోనూ లీటర్ పెట్రోలు ధర 21 పైసల మేర పెరిగిన పెట్రోలు ధర రూ.87.29 గా నమోదైంది. డీజిల్ ధర 31 పైసలు పెరిగి రూ.77.37కి చేరింది.  ఇకపొతే మన ...

Read More »

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ డిసెంబర్‌ 7న పోలింగ్‌

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌పై సస్పెన్స్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. రాజస్థాన్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలంగాణలో డిసెంబర్‌ ఏడో తేదీన పోలింగ్‌ జరగనుం‍ది. ఈ మేరకు తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ ఖరారుపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఓటర్ల జాబితాను ప్రకటించడానికి ఇంకా సమయం ఉందని, ఈ నెల 8న ఓటర్ల తుది జాబితాను ప్రకటించాలని భావించినప్పటికీ.. ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్‌ స్పష్టం చేశారు. అయితే, రాజస్థాన్‌తోపాటే ...

Read More »

తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు గన్నవరంలోనే అక్టోబరు 25న ప్రారంభం…!

తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు గన్నవరంలోనే అక్టోబరు 25న ప్రారంభం…! గన్నవరానికి అంతర్జాతీయ విమానాశ్రయం హోదా ఏడాదిన్నర కిందటే లభించినా, ఇంత వరకూ ఇక్కడ నుంచి విదేశీ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అవసరమైన మౌలిక వసతులను నాలుగు నెలల్లోనే ఏపీ ప్రభుత్వం పూర్తిచేసినా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అనుమతుల విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. అయితే, వీటి నుంచి అనుమతులు లభించడంతో అక్టోబరు 25న తొలి అంతర్జాతీయ విమానం గన్నవరం నుంచి ఎగరనుంది. గన్నవరం నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన ...

Read More »

కేరళకు మళ్ళి రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ….!

కేరళకు మళ్ళి రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ….! కొంతకాలం కిందట భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు మరో భయం వెంటాడుతోంది. భారత వాతావరణ శాఖ సమాచారం మేరకు రానున్న శని, ఆదివారాల్లో కేరళకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు హెచ్చరించారు. ముఖ్యంగా ఇడుక్కి, పలక్కాడ్, త్రిసూర్ జిల్లాలకు అక్టోబర్ 7న రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావం హెచ్చరికలతో అప్రమత్తమైన సీఎం పినరయి విజయన్ ఉన్నతాధికారులతో బుధవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అక్టోబర్ 6వరకు ...

Read More »

గీతం విద్యా సంస్థల అధినేత కన్నుమూత

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం విద్యా సంస్థల అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీవీఎస్‌ మూర్తి దుర్మరణం చెందారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్‌‌ సఫారీని సందర్శించేందుకు ఆయన తన స్నేహితులతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ఎంవీవీఎస్ మూర్తితోపాటు కారులో ప్రయాణిస్తున్న వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వీబీఆర్‌ చౌదరిలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి కడియాల వెంకటరత్నం(గాంధీ) తీవ్రంగా గాయపడ్డారు. ...

Read More »

గాయకుడు బాలభాస్కర్ కన్నుమూత

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రముఖ సింగర్, వయోలినిస్ట్ బాలభాస్కర్ (40) మంగళవారం కన్నుమూశారు. కుటుంబంతో సహా సెప్టెంబరు 25 న దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తూ తిరువనంతపురం శివార్లలో జరిగిన ప్రమాదంలో గాయకుడు బాలభాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు.ఆయన కోలుకోవాలని గత వారం రోజులుగా అభిమానులు, కుటుంబసభ్యులు చేసిన ప్రార్థనలు ఫలించకపోవడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత సోమవారం త్రిస్సూర్‌లోని ఓ ఆలయాన్ని దర్శించుకోడానికి భార్య లక్ష్మీ, కుమార్తె తేజస్వితో సహా బాలభాస్కర్ వెళ్లారు.దర్శనం పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగొస్తుండగా వారు ప్రయాణిస్తు ...

Read More »

సముద్రంలోకి దూసుకెళ్ళిన విమానం.. కానీ అందరూ సేఫ్.. అద్భుతం….!

సముద్రంలోకి దూసుకెళ్ళిన విమానం.. కానీ అందరూ సేఫ్.. అద్భుతం….! ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన విమానం సముద్రంలోకి దూసుకెళ్లింది. పట్టుతప్పి సముంద్రంలోనే ల్యాండ్ అయ్యింది. కానీ అద్భుతం జరిగింది. అందులోని ప్రయాణికులెవ్వరికీ ఏం కాలేదు. 36మంది ప్రయాణికులు, 11మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.  ఈ అద్భుతం ఇండోనేషియాకు సమీపంలోని పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న మైక్రోనేషియన్ దీవుల సమీపంలో చోటు చేసుకుంది. పసిఫిక్ మహా సముద్రంలోని నుగిని దేశానికి చెందిన విమానం వీనో ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవ్వాల్సింది. అయితే రన్ వే ...

Read More »