తాజా వార్తలు

విద్యాబాలన్ విషయంలో ఎంతైనా తగ్గేది లేదంటున్న బాలయ్య…….!

బాలయ్య బాబు తన తండ్రి జీవిత కథనాన్ని ఒక బయోపిక్ గా రూపొందిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ గురించి జాతీయ స్థాయిలో మాట్లాడుకోవాలనేది బాలయ్య బాబు కోరిక అంట. అందుకోసం ఆయన పలు  జాగ్రత్తలు తీసుకొంటున్నారు.  సినిమాకి ఆయనే నిర్మాత కూడా కావడంతో ఏ విషయంలోనూ కూడా రాజీపడకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారట. సినిమాకి ఏం కావాలంటే అది క్షణాల్లో సమకూరుస్తున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే బాలయ్య బాబుకి తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఎన్టీఆర్ సతీమణి  బసవతారకం ...

Read More »

‘RX100– An Incredible love story’ తెలుగు సినిమా రివ్యూ మరియు రేటింగ్ :

నటీనటలు:  వర్గంకార్తికేయ, పాయల్ రాజ్‌పుత్, రావు రమేష్, రాంకీ దర్శకత్వం : అజయ్ భూపతి శైలి : Action,Romance వ్యవధి: 152 విమర్శుకుల రివ్యూ : తెలుగులో ఇప్పటి వరకు చాలా ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకుల వచ్చాయి. వాటిలో కొత్తగా, కొంచెం వెరైటీగా ఉన్న చాలా సినిమాలును  ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ‘తొలిప్రేమ’, ‘ఇడియట్’, ‘ఆర్య’, ‘అర్జున్ రెడ్డి’ లాంటి ప్రేమకథలు యువతకు బాగా నచ్చేశాయి. కానీ ఈ ‘RX100’ వీటితో పోలిస్తే కొద్దిగా భిన్నమైనది. శృతిమించే శృంగారం, భయపెట్టే హింస, మనసును హత్తుకునే ...

Read More »

12 సెకండ్స్ లో మంటలు ఆర్పేసినా మహిళా

జియాంగ్జిలోని ఓ పెట్రోల్‌ బంకులోకి ఓ వ్యక్తి బండిపై ఉండగానే అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. దీంతో అతడు బైక్‌పై నుంచి అమాంతం దూకి పక్కకు వచ్చేశాడు. పక్కన ఉన్న మిగతా వారు కూడా వాళ్ల తమ వాహనాలను తీసుకుని దూరంగా జరిగారు. మంటలను గమనించిన వెంటనే ఇంధనం నింపుతున్న మహిళ ఒక్క సెకను కూడా ఆలోచించకుండా, ధైర్యంగా అగ్నిమాపక పరికరం తెరిచి క్షణాల వ్యవధిలోనే మంటలు ఆర్పేసింది. మరో మహిళా సిబ్బంది ఇంకో అగ్నిమాపక పరికరం తీసుకొని హుటాహుటీన వచ్చారు. కానీ, అప్పటికే మంటలు ...

Read More »

బాహుబలి రికార్డ్స్ ఓకే.. మరి మగధీర సంగతి….!

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను తిరగరాసిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశం మొత్తం మీద అత్యధిక ఎక్కువ  కలెక్షన్లు దక్కించుకున్న తొలి సినిమాగా రికార్డులకెక్కింది. ఇండియాలోని అన్ని భాషల్లో బాహుబలిని విడుదల చేశారు. అన్ని చోట్ల అన్ని భాషల్లోనూ అభిమానులను మెప్పించింది.  ఇక బాహుబలిని ఇతర దేశాల భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. విడుదల చేసిన ప్రతి భాషలోనూ   మంచి ఆదరణ, పేరుని  దక్కించుకుంది.  తాజాగా ఇటీవలే జపనీస్ భాషలోకి డబ్ చేశారు. అక్కడ కూడా అద్భుతమైన ...

Read More »

మొటిమలతో అందంగా మరో కొత్త హీరోయిన్….ఎవరో తెలుసా……..!

ఈ మధ్య మొటిమలు ఉండటం బాగా స్టైల్ అయిపోయింది. మన సౌత్ హీరోయిన్లను మేకప్ లేకుండా చూడటం చాలా తక్కువ. ప్రయోగాత్మక సినిమాల్లోనే అలా చూపిస్తారు కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కానీ ప్రేమ కథల్లో కానీ హీరోయిన్ అందంగా ఉండి తీరాలి. ఈ స్టేట్ మెంట్ కి ఫిదా హీరోయిన్ సాయి పల్లవి అర్థం మార్చేసింది. తన మొహం మీద మొటిమలను ఏ మాత్రం దాచకోకుండా అది కూడా అందంలో భాగమేనంటూ తన నటన ద్వారా అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవి ...

Read More »

పవన్ కళ్యాణ్ కంటికి సర్జరీ

  హైదరాబాద్‌: జనసేన అధినేత-పవర్ స్టార్‌  పవన్‌ కళ్యాణ్ కు కంటికి గురువారం శస్త్రచికిత్స నిర్వహించారు. కొద్దిరోజుల కిందట ఆయన ఎడమ కంటిపై కురుపు ఏర్పడింది. అయినప్పటికీ అలాగే ప్రజా పోరాటయాత్రలో పాల్గొంటున్నారు. కంటి మీద కాంతి పడకుండా నల్లని అద్దాలు వాడుతున్నారు. కంటి సమస్యపై పది రోజుల క్రితమే ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి వైద్యులను పవన్ సంప్రదించగా.. ఆపరేషన్ ఒక్కటే మార్గమని చెప్పినట్లు తెలిసింది. దీంతో.. తీరిక చూసుకుని.. తాజాగా పవన్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ ఎల్వీప్రసాద్‌ ...

Read More »

బరువు తగ్గింది అందుకే.. గడ్డం పెంచింది అందుకే.. అంటున్న రానా…..!

దగ్గుబాటి రానా బాహుబలిలో భల్లాల దేవుడి క్యారెక్టర్ లో ఒదిగిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సినిమాలో పొగరున్న కండలవీరుడిగా కనిపించిన రానా, ఆ తర్వాత కొద్దిగా బక్కచిక్కడంతో రకరకాల పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఆరోగ్య సమస్యలతో రానా ఇబ్బంది పడుతున్నాడని పలు రకాల పుకార్లు వస్తునే ఉన్నాయి. సురేష్ బాబు  రానా పలుసార్లు వీటిని ఖండించినా అవి మళ్ళీ మళ్ళీ సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి.  ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన వెంకీమామ లాంచ్ కు మీడియాను పిలవలేదని  ఆ కార్యక్రమంలో రానా ...

Read More »

అప్పుడే ఆలియాను చూసానంటున్న నాగ్…..

అందరికీ తెలియనీ విషయం ఏఁటంటే చాలా కాలం తర్వాత సుమారు పదిహేనేళ్ల తర్వాత నాగార్జున బాలీవుడ్ లో సినిమా చేస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న  బ్రహ్మాస్త్రలో నాగ్ కి కీలక పాత్ర దక్కింది. ఇందులో అమితాబ్, రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. హిందీలో చివరిగా ఏ సినిమా  చేశానో కూడా నాకు గుర్తు లేదు. కానీ చాలా రోజుల తర్వాత మళ్లీ హిందీ ...

Read More »

చైతూ కోసం నమ్రతను ఫాలో అవుతున్న సమంత….!

మన తెలుగు ఇండస్ట్రీలో హీరోల భార్యలు వారి భర్తల ప్రొఫెషనల్ లైఫ్ లోను వారి సినిమాల కథల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తారు. వారు వారి భర్తలను ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉంచాలని వారి ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలో మొదటిగా సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు భార్య నమ్రత ఉంది. డైరెక్టర్ల విషయంలోనూ, ప్రొడ్యూసర్ల విషయంలోనూ చాలా కటినమైన బాధ్యతను వహిస్తుంది. అందువల్లనే మహేశ్ బాబు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాలను పొందుతున్నాయి.  ఇప్పుడు సమంత కూడా నాగ చైతన్య సినిమాల ...

Read More »

ఒక వంతెన వల్ల…పది మంది కార్మికులు మృతి

బొగోటా: కొలంబియాలో నిర్మాణంలో ఉన్న వంతెనను అధికారులు కూల్చివేశారు. అది ఎందుకో తెలుసా?చిరాజరా కానియన్‌ ప్రాంతంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు  జరుగుతున్న సమయంలోనే ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు మృతి చెందారు. ఆకృతి లోపం వల్లే ఇలా జరిగిందని నిర్ధారించిన అధికారులు వంతెనను కూల్చివేయాలని నిర్ణయించారు. శక్తిమంతమైన పేలుడు పదార్థాలు ఉపయోగించి వంతెనను కుప్పకూల్చారు. దీంతో 446 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి ముగింపు పలికారు.  

Read More »