తాజా వార్తలు

వరుసగా 4, 5 రోజులు బ్యాంక్ కి సెలవులు…!

  వరుసగా 4, 5 రోజులు బ్యాంక్ కి సెలవులు…!బ్యాంకుల్లో ఏవైనా పనులుంటే తక్షణమే పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ వారంలో మిగిలిన ఆరు రోజుల్లో 4 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు. ఇంకా చెప్పాలంటే.. మంగళవారం(నవంబర్ 20) మినహాయిస్తే ఒక గురువారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. ఆ రోజు కూడా కుదరకపోతే ఇంక సోమవారం వరకు ఆగాల్సి వస్తుంది. ఏటీఎంలలోనూ నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉందట. సరిపడేంత నగదు విత్‌డ్రా చేసుకొని పెట్టుకోవడం ఉత్తమం. బుధ, శుక్ర, శనివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. బుధవారం(నవంబరు ...

Read More »

భారత్ రాజధానిలోకి చొరబడ్డ ఉగ్రవాదులు.. ఫోటోలను విడుదల చేసిన ప్రభుత్వం

  భారత్ రాజధానిలోకి చొరబడ్డ ఉగ్రవాదులు.. ఫోటోలను విడుదల చేసిన ప్రభుత్వం. ఢిల్లీలోకి ఉగ్రవాదులు చొరబడినట్టు నిఘా వర్గాలు సమాచారం అందజేయడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులు ఢిల్లీలోకి ప్రవేశించారని.. వారు ఏ క్షణమైనా ఉగ్రదాడికి పాల్పడవచ్చని హెచ్చరిస్తూ వారి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ ఆనవాళ్లతో ఎవరైనా తారసపడితే, తక్షణమే 011-23520787 లేదా 011-2352474 ఫోన్ నంబర్లకు కాల్ చేయాలని పోలీసులు కోరారు. కాగా, పోలీసులు విడుదల ...

Read More »

మహారాష్ట్రలో ఆర్మీ ఆయుధ గోదాంలో ఘోర ప్రమాదం

  మహారాష్ట్రలో ఆర్మీ ఆయుధ గోదాంలో ఘోర ప్రమాదం…!మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన ఆయుధ గోదాంలో పేలుడు జరిగి ఆరుగురు మృతి చెందారు. రక్షణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వార్దా జిల్లాలోని పుల్గావ్‌లో గల ఆర్మీ ఆయుధ గోదాంలో గడువుతీరిన మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు సహా ఆరుగురు మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ...

Read More »

పోలీస్ జాబ్స్ పార్ట్-2 రిజిస్ట్రేషన్ కు మరో ఛాన్స్:తెలంగాణ

పోలీస్ జాబ్స్ పార్ట్-2 రిజిస్ట్రేషన్ కు తెలంగాణలో మరో ఛాన్స్. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండోదశ (పార్ట్‌-2) పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించినట్టు పోలీసు నియామక బోర్డు ఆదివారం అనగా(నవంబర్‌18) ప్రకటించింది. వాస్తవానికి దరఖాస్తు గడువు ఆదివారం అర్ధరాత్రితోనే ముగిసింది. అయితే నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు ‘పార్ట్-2’ రిజిస్ట్రేషన్ పూర్తిచేయని అభ్యర్థులు నవంబరు 22న ఉదయం 8 గంటల నుంచి నవంబరు 24 అర్ధరాత్రి 12 గంటలకు వరకు రిజిస్ట్రేషన్ పూర్తిచేయవచ్చు. ...

Read More »

కానిస్టేబుళ్ళు, ఎస్సై పోస్టులకు వయోపరిమితి పెంచిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ…!

కానిస్టేబుళ్ళు, ఎస్సై పోస్టులకు వయోపరిమితి పెంచిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ…!ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు పోలీసు శాఖ మరో గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,137 కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు పోలీసు నియామక మండలి ఇటీవల విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పెంచాలని పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో కానిస్టేబుల్‌ పోస్టులకు 18 – 24 ...

Read More »

గడగడలాడిస్తున్న గజ తుఫాన్.. 8మంది మృతి…!

గడగడలాడిస్తున్న గజ తుఫాన్.. 8మంది మృతి…! ఏపీ, తమిళనాడును వణికించిన గజ తుఫాన్ తీరం దాటింది. తమిళనాడులో శుక్రవారం తెల్లవారౌజామున నాగపట్నం, వేదారణ్యం మధ్య తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తమిళనాడు, పాండిచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నారు. తీరం వెంబడి 110 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. మరో 16 గంటల పాటూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో హై అలర్ట్ కొనసాగుతోంది. గురువారం రాత్రి నుంచే తమిళనాడులోని తిరుచ్చి, తంజావూరు, పుడుకొట్టాయ్, నాగపట్నం, కడలూరు, తిరువారూర్, రామనాథపురంలో ఈదురుగాలులతో కూడిన భారీ ...

Read More »

గజ తుఫానుపై ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

గజ తుఫానుపై ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ, తమిళనాడు తీరం వైపు ‘గజ’ తుఫాను దూసుకొస్తుంది. ఈ గురువారం (నవంబరు 15) సాయంత్రం కడలూరు-పంబన్‌ మధ్య తీరం దాటనుందట. బుధవారం సాయంత్రానికి చెన్నైకు 430 కి.మీ., నాగపట్నానికి 510 కి.మీ. దూరంలో నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ విధంగా పశ్చిమ నైరుతిగా పయనించి తొలుత తీవ్ర తుఫాన్‌గా మారి, ఆ తర్వాత బలహీనపడి తుఫాన్‌గా మారుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అలలు ఎగిసిపడుతున్నాయని వాతావరణశాఖ ...

Read More »

పింక్ డైమండ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!

పింక్ డైమండ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!ఎంతో అందమైన, అత్యంత అరుదైన గులాబీ రంగు వజ్రం ‘పింక్‌ లెగసీ’ రికార్డు సృష్టించింది. వేలంలో భారీగా 50 మిలియన్‌ డాలర్లు పలికిన అరుదైన ఘనత సాధించుకుంది. మంగళవారం (నవంబరు 13) రాత్రి స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన వేలంలో ఈ 19 క్యారెట్‌ పింక్‌ డైమండ్‌ను అమెరికాకు చెందిన హ్యారీ విన్ స్టన్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ అరుదైన వజ్రం వేలంలో 50 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.360 కోట్లు) పలికిందని దాన్ని వేలం వేసిన సంస్థ ...

Read More »

వచ్చే 12 గంటల్లో ఆంధ్ర.. తమిళనాడుపై గజ తుఫాను ప్రభావం

వచ్చే 12 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుపై గజ తుఫాను ప్రభావం. తిత్లీ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు మంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడి గజ రూపంలో దూసుకొస్తోంది. వచ్చే 12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర వైపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది శ్రీహరి కోటకు 980 కిలోమీటర్లు చెన్నైకు 840 కిలోమీటర్ల దూరంలో ఉంది. బుధవారం చెన్నై నాగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ ప్రభావం తమిళనాడుపై ...

Read More »

బిజేపి సీనియర్ నేత కన్నుమూత

కేంద్రమంత్రి అనంత్ కుమార్ (59) అనారోగ్యముతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న అనంత్‌కుమార్ 1959 జులై 22న కర్ణాటకలో జన్మించారు. ఆయన తొలిసారిగా 1996 సాధారణ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. ఇక 2014 సార్వత్రిక ...

Read More »