తాజా వార్తలు

పైలట్ల సిక్ లీవ్.. విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా…!

పైలట్ల సిక్ లీవ్.. విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా…!ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ ఆదివారం 14 విమానాలు రద్దు చేసింది. రుణ భారంతోపాటు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక జెట్‌ ఎయిర్‌వేస్‌ నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కాగా నిన్న కొందరు పైలట్లు ఆరోగ్యం బాగోలేదని ‘సిక్‌’ లీవ్‌ పెట్టారు. దీంతో పైలట్లు అందుబాటులో లేక విమానయాన సంస్థ ఏకంగా 14 విమానాలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేతనాలు సరిగ్గా చెల్లించకపోవడం వల్లే పైలట్లు సిక్‌ లీవ్‌ పెట్టారని సంబంధిత వర్గాల ...

Read More »

అనారోగ్యంతో సీనియర్ బుష్ కన్నుమూత

అనారోగ్యంతో సీనియర్ బుష్ కన్నుమూత, అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్(94) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు జార్జ్ హెర్‌బర్ట్ వాకర్ బుష్1924 జూన్ 12న మస్సాచూసెట్స్ రాష్ట్రంలోని మిల్టన్‌లో జన్మించారు. జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్‌ శుక్రవారం అర్ధరాత్రి మరణించినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. తన తండ్రి మరణ వార్తను అందరికీ తెలియజేయడానికి చాలా బాధపడుతున్నానని బుష్‌ కుమారుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు జూనియర్ బుష్ ట్విట్టర్‌‌లో పేర్కొన్నాడు. ఆయన మంచి తండ్రి మాత్రమే కాదు, మంచి వ్యక్తిత్వం గల మనిషి, ఒక తత్వవేత్త, మార్గదర్శిగా ...

Read More »

యూఏఈ టూ ఇండియా హైస్పీడ్ అండర్ వాటర్ రైలు…!

  యూఏఈ టూ ఇండియా హైస్పీడ్ అండర్ వాటర్ రైలు…!భారతీయులు త్వరలోనే అండర్‌వాటర్‌ రైలు ప్రయాణాన్ని కూడా చేయబోతున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్(యూఏఈ)‌ నుంచి భారత్‌ వరకు అండర్‌వాటర్‌ హైస్పీడ్‌ రైలును తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూఏఈలోని ఫుజురాయ్‌ నగరం నుంచి ముంబయి వరకు నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించే యోచన చేస్తున్నట్లు యూఏఈకి చెందిన నేషనల్‌ అడ్వైజర్‌ బ్యూరో కంపెనీ తెలిపింది. ఈ విషయాన్ని సదరు కంపెనీ ఎండీ అబ్దుల్లా అల్‌షేహి వెల్లడించారు. ఈ మేరకు దుబాయ్‌కు చెందిన ఖలీజ్‌ టైమ్స్‌ ...

Read More »

AEE ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన APPSC

AEE ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన APPSC. ఏపీలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి APPSC గురువారం(న‌వంబ‌ర్ 29) నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు అప్లికేషన్లు పెట్టుకునే అర్హుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మ‌ధ్యనే ఉండాలి. రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు డిసెంబరు 3 నుంచి 24 ...

Read More »

స్టాక్‌హోమ్‌లో ఎయిర్‌ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం…!  

స్టాక్‌హోమ్‌లో ఎయిర్‌ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం…!స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఎయిర్‌ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానం ఎడమ రెక్క ఆర్లాండా విమానాశ్రయంలోని టర్మినల్‌ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులున్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నట్లు  అధికారులు వెల్లడించారు. విమానం రెక్క టర్మినల్‌ గోడను ఢీకొట్టడంతో ఒక్కసారిగా కుదుపుకు గురైందని, ప్రయాణికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.   వాస్తవానికి ఇక్కడ విమానాలు వచ్చేందుకు ...

Read More »

శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ

శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి43 వాహకనౌకను గురువారం ఉదయం 9.58 గంటలకు విజయవంతంగా నింగిలోకి ప్రయోగించారు. నిరంతరాయంగా 28 గంటలపాటు కొనసాగిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ అనంతరం వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. మూడు దశలను విజయవంతంగా పూర్తిచేసుకుంది. కీలకమైన చివరి దశ పూర్తి కావడానికి మరో గంటకు పైగా సమయం పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రాకెట్‌లో అమెరికాకు చెందిన 23 ఉపగ్రహాలు, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్‌, మలేషియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌లకు చెందిన ఒక్కొక్క ...

Read More »

హెలికాప్టర్ మెట్టు దిగుతూ జారిపడిన అమిత్ షా…!

హెలికాప్టర్ మెట్టు దిగుతూ జారిపడిన అమిత్ షా…!బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పొరపాటున ఓ హెలికాప్టర్ నుంచి జారిపడ్డారు. మిజోరాం ఎన్నికల ప్రచారం సందర్భంగా గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తరపున ప్రచారం చేసేందుకు అమిత్ షా వెస్ట్ తుయ్‌పూయ్‌ నియోజకవర్గంలోని త్లబంగ్ గ్రామానికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్ దిగబోయిన ఆయన పొరపాటున ఓ మెట్టు వదిలేశారు. దీంతో అమాంతం నేలపై బోర్లా పడిపోయారట. అమిత్‌షాతో పాటు హెలికాప్టర్‌లో ...

Read More »

జమ్మూలో  అనంత్‌నాగ్ జిల్లాలో ఆరుగురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌…!

జమ్మూలో  అనంత్‌నాగ్ జిల్లాలో ఆరుగురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌…!కాశ్మీర్‌లోకి టెర్రరిస్టుల చొరబాట్లు ఆగడం లేదు. కొద్ది రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో సరిహద్దు దాటేస్తున్నారు. ముందుగానే అప్రమత్తమవుతున్న ఆర్మీ.. చొరబాట్లకు బ్రేకులు వేస్తోంది. ఎక్కడికక్కడే గస్తీ కాస్తూ ఉగ్రవాదుల్ని అడ్డుకుంటోంది. తాజాగా శుక్రవారం ఉదయం అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌భేరా ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు చేస్తుండగా.. ఆరుగురు ఉగ్రమూకలు కంటపడ్డారు. వెంటనే బలగాలు వారిని చుట్టుముట్టాయి.   దీంతో ఆర్మీ, టెర్రరిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. ...

Read More »

వరుసగా 4, 5 రోజులు బ్యాంక్ కి సెలవులు…!

  వరుసగా 4, 5 రోజులు బ్యాంక్ కి సెలవులు…!బ్యాంకుల్లో ఏవైనా పనులుంటే తక్షణమే పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ వారంలో మిగిలిన ఆరు రోజుల్లో 4 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు. ఇంకా చెప్పాలంటే.. మంగళవారం(నవంబర్ 20) మినహాయిస్తే ఒక గురువారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. ఆ రోజు కూడా కుదరకపోతే ఇంక సోమవారం వరకు ఆగాల్సి వస్తుంది. ఏటీఎంలలోనూ నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉందట. సరిపడేంత నగదు విత్‌డ్రా చేసుకొని పెట్టుకోవడం ఉత్తమం. బుధ, శుక్ర, శనివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. బుధవారం(నవంబరు ...

Read More »

భారత్ రాజధానిలోకి చొరబడ్డ ఉగ్రవాదులు.. ఫోటోలను విడుదల చేసిన ప్రభుత్వం

  భారత్ రాజధానిలోకి చొరబడ్డ ఉగ్రవాదులు.. ఫోటోలను విడుదల చేసిన ప్రభుత్వం. ఢిల్లీలోకి ఉగ్రవాదులు చొరబడినట్టు నిఘా వర్గాలు సమాచారం అందజేయడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులు ఢిల్లీలోకి ప్రవేశించారని.. వారు ఏ క్షణమైనా ఉగ్రదాడికి పాల్పడవచ్చని హెచ్చరిస్తూ వారి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ ఆనవాళ్లతో ఎవరైనా తారసపడితే, తక్షణమే 011-23520787 లేదా 011-2352474 ఫోన్ నంబర్లకు కాల్ చేయాలని పోలీసులు కోరారు. కాగా, పోలీసులు విడుదల ...

Read More »