తాజా వార్తలు

రాజస్థాన్ లో దూసుకుపోతున్న కాంగ్రెస్

రాజస్థాన్ లో దూసుకుపోతున్న కాంగ్రెస్., ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో దూసుకుపోతుంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఆ పార్టీ ముందంజలో ఉంది. మిజోరం, తెలంగాణలో ఆ పార్టీ వెనుకంజలో ఉంది. మధ్యప్రదేశ్‌(230)లో 114 స్థానాల్లో కాంగ్రెస్‌, 101 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌(199)లో 102 స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండగా బీజేపీ 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఛత్తీస్‌గఢ్(90)‌లో 58 స్థానాల్లో కాంగ్రెస్‌, 23 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి.     అయితే, తెలంగాణ(119) లో ...

Read More »

జీవన్‌రెడ్డి ఓటమి పాలు: జగిత్యాల

జీవన్‌రెడ్డి ఓటమి పాలు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి జగిత్యాలలో ఓటమి పాలయ్యారు. తెరాస అభ్యర్థి సంజయ్‌ కుమార్‌ చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో జీవన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైన సంజయ్‌కుమార్‌ ఈ సారి ఆయనపై విజయం సాధించారు. దీంతో జీవన్‌రెడ్డి విజయాల పరంపరకు బ్రేక్‌ పడింది. ఆయన ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు.   1989, 1996(ఉపఎన్నికలు), 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఎన్టీఆర్‌, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిల ...

Read More »

విజయ్ మాల్యాను భారత్ కి అప్పగించాలంటూ బ్రిటన్ కోర్ట్ తీర్పు  

విజయ్ మాల్యాను భారత్ కి అప్పగించాలంటూ బ్రిటన్ కోర్ట్ తీర్పు. భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగగొట్టి బ్రిటన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు యూకేలోని వెస్ట్ మినిస్టర్ కోర్టు షాకిచ్చింది. ఆయనను భారత్‌ కు అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రూ.9వేల కోట్ల మేర బ్యాంకులను మోసం చేయడం, మనీ లాండరింగ్‌కు పాల్పడటం వంటి నేరారోపణలున్న మాల్యాపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు 2016లో ఆయన లండన్ పారిపోయారు. దీంతో మాల్యాను తమకు ...

Read More »

పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు  

పంచాయితీ ఎన్నికలకు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్., హైకోర్టు  పంచాయితీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో మరోసారి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. దీని మీద హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం చెప్తేనే తాము ఎన్నికలు నిర్వహించగలమని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తెలిపింది. ఈ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ...

Read More »

ఒక్క ఓటు కూడా వెయ్యని ఊరు.. ఎందుకో తెలుసా…!

హామీలు నెరవేర్చని నేతలను మేం ఎన్నుకోబోము అంటూ ఓట్లు వేయం అని మహబూబాద్ జిల్లాలోని బయ్యారం మండలం మొట్ల తిమ్మాపురం గ్రామస్తులైన ఆదివాసులు పోలింగ్‌ను బాయ్‌కాట్ చేశారు. ఒక్కరు కూడా పోలింగ్ బూత్ వైపు రాకపోవడంతో ఎన్నికల సిబ్బంది హైరానా పడ్డారు. విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.       దట్టమైన అటవి ప్రాంతంలో ఉండే మా ఊరిని ఏ నాయకుడూ పట్టించుకోలేదనీ.. ఎవరు వారి కష్టాలను తీర్చలేదని  ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు ఓటు ...

Read More »

కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

భూమధ్యరేఖను ఆనుకుని బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. గురువారం ఒక అల్పపీడనం, తర్వాత డిసెంబరు 9న మరోకటి ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. వీటి ప్రభావం రాబోయే మూడు రోజుల్లో హిందూమహాసముద్రం, బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న దక్షిణాది రాష్ట్రాల తీర ప్రాంతాలపై ఉంటుందని, బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. మత్స్యాకారులు వేటకు వెళ్లరాదని, గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమల్లోని అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా ...

Read More »

హైదరాబాద్ శివారులో 800 కోట్లు నిల్వ..ఎలక్షన్లకు కట్టలు గుట్టలే…!

హైదరాబాద్ లో 800 కోట్లు నిల్వ.. కట్టలు గుట్టలే…!ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్ సమయం దగ్గరపడుతోన్న కొద్దీ ప్రలోభాల పర్యం ఊపందుకుంది. ఎన్నికల కమిషన్‌, పోలీస్‌ యంత్రాంగం డేగ కళ్లతో నిఘాపెట్టి, విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు నోట్ల కట్టలను సిద్ధం చేసుకున్నాయి. బుధవారం రాత్రి నుంచి శుక్రవారం వరకూ నగదు పంపిణి చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు సంచులను అత్యంత రహస్యంగా తరలిస్తున్నారు. ఓట్లను కొనుగోలు చేయడానికి హైదరాబాద్‌‌తోపాటు శివారు ప్రాంతాల్లో రూ.800 కోట్లను దాచి ఉంచినట్టు పోలీసులు భావిస్తున్నారు. ...

Read More »

100% తీర్చేస్తా.. ప్లీజ్ తీస్కోండి:మాల్యా

100% తీర్చేస్తా.. ప్లీజ్ తీస్కోండి మాల్యా…!బ్యాంకు రుణాలు ఎగవేసినట్టు తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని విదేశాల్లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా అని పేర్కొన్నారు. తాను బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాల అసలు మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తానని ఇంతకు ముందే చెప్పానంటూ ట్వీట్ చేశారు. మరో ఐదురోజుల్లో భారత్ దాఖలు చేసిన నేరస్తుల అప్పగింత కేసుపై యూకే కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలోనే అక్కడ తలదాచుకుంటున్న మాల్యా ఈ మేరకు స్పందించడం గమనార్హం. ప్రభుత్వ బ్యాంకుల్లోని సొమ్ములను తీసుకుని పారిపోయాడంటూ నన్ను ఎగవేతదారుగా ...

Read More »

గన్నవరం నుంచి సింగపూర్ కి ఎగిరిన తొలి అంతర్జాతీయ విమానం

గన్నవరం నుంచి సింగపూర్ కి ఎగిరిన తొలి అంతర్జాతీయ విమానం., విజయవాడ ప్రజలు గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తోన్న కల నిజమైంది. గన్నవరం నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. 88 మంది ప్రయాణికులతో కూడిన ఇండిగో విమానం మంగళవారం రాత్రి సింగ్‌పూర్ బయలుదేరింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర పౌరవిమానయాన మంత్రి సురేశ్ ప్రభుతో కలిసి ఈ విమానాన్ని ప్రారంభించారు. గన్నవరం నుంచి సింగ్‌పూర్‌కు వారానికి రెండుసార్లు సర్వీసులు నడుస్తాయట. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ రవాణాపరంగా అనుసంధానత పెరిగితేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. గన్నవరం విమానాశ్రయం ఇంటిగ్రేటెడ్ ...

Read More »

రేవంత్ రెడ్డిని విడుదల చేసిన పోలీసులు

రేవంత్ రెడ్డిని విడుదల చేసిన పోలీసులు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. భారీ భద్రత మధ్య ఆయన్ను జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి కొడంగల్‌ కు తరలించారు. ఉదయం నాలుగు గంటల సమయంలో ఇక్కడికి తీసుకొచ్చిన పోలీసులు సుమారు 12 గంటలపాటు నిర్భందించారు.   రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఆదేశాల మేరకు రేవంత్‌ను పోలీసులు విడుదల చేశారు. రేవంత్ స్టార్ క్యాంపెయినర్ అని ఆయన ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని ఆయన్ను వెంటనే విడుదల చేయాలంటూ ...

Read More »