రాజకీయ వార్ఠలు

అలుపులేని పాదయాత్ర కొనసాగిస్తున్న పెద్దల అంజిబాబు

అలుపులేని పాదయాత్రతో ఈ రోజున జూబ్లీహిల్స్ BLF పార్టీ  అభ్యర్థి పెద్దల అంజిబాబు గారు పాదయాత్రలో భాగంగా రాజ్ నగర్, మధురానగర్, భరత్ నగర్, బాబా సైలని నగర్, బోరబండ సైట్ 2, బంజారా నగర్, స్వరాజ్ నగర్  ప్రాంతాలు తిరగడం జరిగింది. ఎంతో ఓర్పుతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి కాలనీ.. ప్రతి ఇంటికి వెళ్ళి వారిని పలకరించి వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. పేదలకు ఇళ్ళపట్టాలు, గృహవసతి కల్పనకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.   పాదయాత్రలో పాల్గొన్న నాయకులు L.V, సాయి శేషగిరి ...

Read More »

తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితాలో టీడీపీ స్థానాలు

తెలంగాణ తొలి జాబితాలో టీడీపీ స్థానాలు, తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే రోజున నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో 38 నియోజకవర్గాల్లో 48 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, 65 మందితో కూడిన తొలి జాబితాను టికాంగ్రెస్ ప్రకటించింది. మహాకూటమిలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కూడా తొమ్మిది నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. తొలి జాబితాలో తొమ్మిది మంది టీడీపీ అభ్యర్థులను సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. మహాకూటమిలో ...

Read More »

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

  కాంగ్రెస్ 65 మందితో తొలి జాబితా విడుదల, దాదాపు రెండు నెలల నిరీక్షణ తరువాత తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, రాహుల్ గాంధీ మరికొందరు కీలక నేతలు చర్చించిన తర్వాత 65 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. నవంబర్ 12తేదీ రాత్రి ఖచ్చితంగా కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తుందని కుంతియా చెప్పినట్లుగానే రాత్రివరకూ సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల తొలి జాబితాను ...

Read More »

జూబ్లీహిల్స్ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న పెద్దల అంజిబాబు

BLP పార్టీ నేత పెద్దల అంజిబాబు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ బోరబండ డివిజన్లో పాదయాత్ర చేశారు. వారి వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని మీ నాయకుడిగా మీ సేవకై అంకితమై ఉంటానని మాట ఇచ్చారు. వారి అభివృద్ధికై కృషి చేస్తానని తెలిపారు. ఈసారి ప్రజలు కూడా ఇలాంటి నాయకుడు కోసమే ఎదురు చూస్తున్నారు.   SC, ST, BC మైనారిటీ మరియు అగ్రకులాలలోని పేదల అభివృద్ధికై కృషి చేయదలిచానన్నారు. వారి కష్టాలు తీర్చే ప్రజల నాయకుడిగా ఉంటానని.. ప్రతి ...

Read More »

కొత్తదనం కోరుకుంటున్న జూబ్లీహిల్స్ ప్రజానీకం

జూబ్లీహిల్స్ ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కొత్తదనమేమిటంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజల సమస్యల్నీ.. అభివృద్ధినీ.. పట్టించుకోకుండా తమ స్వార్థానికి పదవుల్ని ఉపయోగించుకుంటున్నారు. అలా స్వార్థపూరితమైన వారిని కాకుండా ప్రజల కొరకు, ప్రజల సేవకుడిగా.. ప్రజల కోసమే అంకితమై ఉండే ప్రజా నాయకుడిని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.  జూబ్లిహిల్స్ అంటే ధనికుల వర్గం ఉండే ప్రాంతంగా అందరూ భావిస్తారు. కానీ, ఆ నియోజకవర్గంలో అసలు జూబ్లీహిల్స్ ఏరియా మొత్తం లేదు.    మధ్య తరగతి, పేదలు, నిరుపేదలు ఉన్నారు. ముఖ్యంగా ...

Read More »

ప్రజలు బిఎల్ఎఫ్ ను ఎంతగానో ఆదరిస్తున్నారంటున్న వీరభద్రం

ప్రజలు బిఎల్ఎఫ్ ను ఎంతగానో ఆదరిస్తున్నారంటున్న వీరభద్రం, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బిఎల్‌ఎఫ్‌) శుక్రవారం మహబూబాబాద్‌లోని గాంధీపార్క్‌ లో బహిరంగసభ నిర్వహించింది. ఈ సభ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ఇన్నాళ్లు పాలించిన పార్టీలు ప్రైవేటు ఆస్పత్రులకు కొమ్ముకాశారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు  ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని తెలిపారు.   తమ బిఎల్ ఎఫ్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. రైతుబంధు లాగానే కూలిబంధు పథకాన్ని ...

Read More »

కేసీఆర్ కి పోటీగా గద్దర్…!

కేసీఆర్ కి పోటీగా గద్దర్…! తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతానంటున్నారు ప్రజా నాయకుడు గద్దర్. సీఎం కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో భేటీ తర్వాత మాట్లాడిన ఆయన తెలంగాణ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదన్నారు గద్దర్. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియాలను కలవడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. సేమ్ డెమొక్రసీ నినాదాన్ని మాత్రమే వారికి వివరించానన్నారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం ...

Read More »

బీజేపీకి చుక్కలు చూపిస్తామంటున్న కుమారస్వామి

బీజేపీకి చుక్కలు చూపిస్తామంటున్న కుమారస్వామి, ఈ ఎన్నికల్లో తాము నైతిక విజయం సాధించామని కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి నాలుగు చోట్ల విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై కుమారస్వామి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తదితరులు స్పందించారు. ఈ విజయం ట్రైలర్ మాత్రమేనని, ఇది తొలి అడుగు అని, వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీకు చుక్కలు చూపిస్తామని కుమారస్వామి అన్నారు. రాష్ట్రంలో 28 లోకసభ స్థానాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలసి అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తామన్నారు. ...

Read More »

జ‌గ‌న్ పై సంచలన వ్యాఖ్య‌లు చేస్తున్న ఎంపీ జేసీ

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టీపిక్ అవుతున్నాయి. గ‌త నెల‌లో విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో జ‌గ‌న్ పై హత్యాయ‌త్నంలో భాగంగా దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లంద‌రూ జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వైసీపీ శ్రేణులు కూడా వాటిని తిప్పికొట్టారు. అయితే తాజాగా జేసీ దివాక‌ర్ రెడ్డి జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి పై సంచ‌ల‌న ...

Read More »

మాజి సీఎం తనయుడు కారు ఎక్కనున్నారా…!

మాజి సీఎం తనయుడు కారు ఎక్కనున్నారా…! అంటే మాజీ మంత్రి జలగం ప్రసాదరావు శనివారం (నవంబరు 3) టీఆర్ఎస్‌ పార్టీలో చేరబోతున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారట. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడైన జలగం ప్రసాదరావు 1999లో కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఐతే బహిష్కరణను ఎత్తివేస్తున్నట్టు శుక్రవారం (నవంబరు 2) కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించినప్పటికీనూ ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలోనే చేరాలని నిర్ణయించుకున్నారట. పొంగులేటి సుధాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారనే కారణంతో ఆయన్ను పార్టీ వ్యవహారాల నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. అప్పటి నుంచి ఆయన మళ్లీ ...

Read More »