బెల్లంకొండ న్యూ లుక్:’కవచం’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. దీనికి ‘క‌వ‌చం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కాజ‌ల్ క‌థానాయిక‌. ఇందులో బెల్ల‌కొండ ఓ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. క‌థానాయిక‌ని క‌వ‌చంలా ర‌క్షించే బాధ్య‌త క‌థానాయ‌కుడిపై ప‌డుతుంది. అందుకే.. ‘క‌వ‌చం’ అనే టైటిల్ నిర్దారించార్ట‌. మెహ‌రీన్ మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.నీల్ నితిన్ ముఖేష్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ని పోషిస్తున్నాడు. డిసెంబ‌రులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అతి త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది. యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ఇది. ఫైట్స్‌ని కొత్త‌ర‌కంగా డిజైన్ చేశార‌ట‌. టీజ‌ర్‌లోనూ యాక్ష‌న్ పార్టే అధికంగా క‌నిపించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ‘జ‌య జాన‌కి నాయ‌క’ త‌ర‌వాత వ‌చ్చిన ‘సాక్ష్యం’ ఫ్లాపుల లిస్టులో చేరింది. బెల్లంకొండ మ‌ళ్లీ రేసులో రావాలంటే… ‘క‌వ‌చం’ హిట్ట‌యి తీరాల్సిందే. మ‌రి బెల్లంకొండ ఏం చేస్తాడో చూడాలి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*