పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు దేనికోసం

ys jagan and pawan kalyan

 

పవన్ కళ్యాణ్  రాజకీయ పార్టీ ఏర్పాటు దాదాపుగా ఖరారు అయిన నేపద్యంలో జనసేన పార్టీ పేరుతో ఏర్పడబోయే ఈ పార్టీ గురించి శుక్రవారం పవన్ కళ్యాణ్  మీడియా ముందుకు వస్తున్నాడని , హైటెక్స్ జరగబోయే కార్యక్రమంలో పవన్ తన వ్యక్తిగత జీవితం గురించి వివరణ ఇచ్చి కొత్త పార్టీ విధి విధానాల గురించి ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి పవన్ ఇంత ధైర్యంగా కొత్త పార్టీ ఆలోచన చేయడానికి కారణం ఎవరు? అనే విషయాన్ని ఆరా తీస్తే పవన్ కు ఒక మీడియాధినేత అండ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్  పార్టీ గురించిన వార్తలను పతాకశీర్షికలకు ఎక్కిస్తూ పవన్ పార్టీని హైలెట్ చేసే బాధ్యత  తానే తీసుకొంటానని ఆ మీడియాధినేత పవన్ కళ్యాణ్ కు స్పష్టమైన హామీ ఇచ్చాడని  ఆయన  ప్రోత్సహంతోనే పవన్ పార్టీ విషయంలో ముందడుగు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో రెండు రాజకీయ పార్టీల ఆవిర్భావ సమయంలో కూడ ఆ మీడియాధినేత కీలక పాత్ర పోషించాడాట. అన్నయ్య చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ మీడియాధినేత మంచి సహకారం అందించాడనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆయనే పవన్ కళ్యాణ్ పార్టీకి కూడా ప్రచార సహకారం అందిస్తున్నాడని భోగట్టా.

మరి దీని వల్ల ఆ మీడియాధినేతకు ఒరిగేది ఏమిటి అంటే… అంతర్గతంగా చాలా ప్రయోజనాలే ఉంటాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ద్వారా జగన్ ను దెబ్బ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడట ఆయన. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానీకుండా చేసే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదని భావిస్తున్న ఆయన పవన్ ను కూడా ట్రంప్ కార్డుగా వాడి జగన్ ను దెబ్బ కొట్టాలని భావిస్తున్నాడట. పవన్ పార్టీ వల్ల జగన్ కు పడే ఓట్లు సైడ్ ట్రాక్ పడతాయా.. ఫలితంగా జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలపై దెబ్బ పడుతుంధా అని ఆయనే లెక్కలేసుకొంటున్నాడట. మరి ఈ లెక్కలన్నీ నిజం అవుతాయా? పవన్ పార్టీ జగన్ పార్టీ ని దెబ్బతీయగలదా? అనే ప్రశ్నలకు ఎన్నికల ఫలితాలే సమాధానం చెప్పాలి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*