సుమన్ గెలుపు కష్టతరంగా మారుతుందా..!

ముఖ్యమంత్రి తనయుడు కేటిఅర్ కు ఉన్న అనురాగ శిష్యుల్లో మాజీ ఎంపీ బాల్క సుమన్ కూడ ఒకరు. ప్రతి నిమిసం కేసిఆర్, కేటిఆర్ లను వెనుకేసుకొస్తూ, వాళ్ళను విమర్శించిన వాళ్ళకు ధీటుగా సమాధానం చెబుతూ స్వామి భక్తిని ప్రదర్శించే సుమన్ కు రాబోయే ఎన్నికల్లో చెన్నూరు టిక్కెట్టును కన్ఫర్మ్ చేసింది అధిష్టానం.నల్లా ఓదెలు రూపంలో తీవ్ర అసమ్మతి ఎదురైనా సుమన్ ను మార్చలేదు కేసిఆర్. పైగా అక్కడి పరిస్థితుల్ని కూడ కొంత చక్కబెట్టి మార్గాన్ని సుగమం చేశారు.

కానీ తాజాగా కాకా కుమారుల రూపంలో సుమన్ కు కొత్త కష్టం వచ్చి పడింది. రాష్ట్రంలోని బలమైన నాయకుల్లో ఒకరైన కాకా వెంకటస్వామి కుమారులు వివేక్, వినోద్ ఇద్దరూ బలమైన నేతలే. వారిలో వివేక్ తన సోదరుడు వినోద్ కు చెన్నూరు టికెట్ ఆశించగా దక్కలేదు. దీన్ని తీవ్రంగా తీసుకున్న వివేక్ కేసిఆర్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. తనకు పెద్దపులి ఎంపీ టికెట్ దక్కినా సోదరుడు వినోద్ ఖాళీ చేతుల్తో మిగలడం వివేక్ కు రుచించలేదు.

అందుకే నాయకుడి నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించే అవకాశం లేకపోయినా చెన్నూరు నియోజవర్గంలో సుమన్ తో కలిసి పనిచేయకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇలా ఓదెలు అసమ్మతి, వివేక్ అసంతృప్తి రెండూ కలిసి సుమన్ గెలుపుని కష్టతరంగా మార్చేలా కనిపిస్తున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*