విద్యాబాలన్ విషయంలో ఎంతైనా తగ్గేది లేదంటున్న బాలయ్య…….!

బాలయ్య బాబు తన తండ్రి జీవిత కథనాన్ని ఒక బయోపిక్ గా రూపొందిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ గురించి జాతీయ స్థాయిలో మాట్లాడుకోవాలనేది బాలయ్య బాబు కోరిక అంట. అందుకోసం ఆయన పలు  జాగ్రత్తలు తీసుకొంటున్నారు.  సినిమాకి ఆయనే నిర్మాత కూడా కావడంతో ఏ విషయంలోనూ కూడా రాజీపడకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారట. సినిమాకి ఏం కావాలంటే అది క్షణాల్లో సమకూరుస్తున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే బాలయ్య బాబుకి తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది.

ఎన్టీఆర్ సతీమణి  బసవతారకం పాత్రలో విద్యాబాలన్  నటిస్తే బాగుంటుందని దర్శకుడు క్రిష్ చెప్పగానే బాలకృష్ణ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. స్వయంగా  విద్యాబాలన్ ఇంటికి బాలయ్యే వెళ్లి మా సినిమాలో  నటించాలని అడిగారట. చిన్న పాత్రయినా ఆమె 2 కోట్ల రూపాయలు పారితోషికం అడిగినట్లు  సమాచారం.అంత ఎక్కువ మొత్తంలో అయినా వెనక్కి తగ్గకుండా బాలయ్య అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ఓకే చెప్పేసి ఆమె అంగీకారం తీసుకున్నాడట. విద్యాబాలన్ లాంటి హీరోయిన్ సినిమాలో నటిస్తే జాతీయ స్థాయిలో పేరు వస్తుంది కాబట్టి తన తండ్రి సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుకోవాలనే ఆలోచనతోనే బాలకృష్ణ ఎక్కడా రాజీపడకుండా నిర్ణయాలు తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. 

విద్యాబాలన్ విషయంలోనే కాదు టాలీవుడ్ లో పలువురు అగ్ర కథానాయకుల్ని ఎన్టీర్ బయోపిక్ లో భాగం చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారట బాలయ్య. ఈ ప్రాజెక్టులోకి క్రిష్ రావడంతో మరింత క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాని  వచ్చే సంవత్సరం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విధంగా సినిమాను ఏ విషయంలోనూ తగ్గకుండా అన్ని ఏర్పాట్లు స్వయంగా బాలయ్య బాబే చూసుకుంటున్నారని తెలుస్తుంది.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*