బాహుబలి రికార్డ్స్ ఓకే.. మరి మగధీర సంగతి….!

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను తిరగరాసిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశం మొత్తం మీద అత్యధిక ఎక్కువ  కలెక్షన్లు దక్కించుకున్న తొలి సినిమాగా రికార్డులకెక్కింది. ఇండియాలోని అన్ని భాషల్లో బాహుబలిని విడుదల చేశారు. అన్ని చోట్ల అన్ని భాషల్లోనూ అభిమానులను మెప్పించింది. 
ఇక బాహుబలిని ఇతర దేశాల భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. విడుదల చేసిన ప్రతి భాషలోనూ   మంచి ఆదరణ, పేరుని  దక్కించుకుంది.

 తాజాగా ఇటీవలే జపనీస్ భాషలోకి డబ్ చేశారు. అక్కడ కూడా అద్భుతమైన పేరు, ఆదరణ లభించింది. అక్కడి ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. మోస్తరు కలెక్షన్లను రాబట్టింది. అక్కడి అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాలో కుమారవర్మ పాత్రను పోషచిన చేసిన సుబ్బరాజు అభిమానుల కోరిక మేరకు జపాన్ వెళ్లి వారిని కలిసి వచ్చాడు. బాహుబలికి జపాన్ లో వచ్చిన ఆదరణను, కలెక్షన్లను చూసి ఇప్పుడు మగధీర మూవీ మేకర్స్ కూడా అదే ఆలోచనలో పడ్డారనే వార్త హల్ చల్ చేస్తోంది. 

 మగధీర మూవీ 2009 లో విడుదల అయ్యింది. విడుదల అయ్యి కూడా దాదాపు పదేళ్లు పూర్తయ్యింది. బాహుబలికి దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇప్పుడు మగధీరని జపాన్ లో చూపించడానికి నిర్మాతలు ఆసక్తితో ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ విషయమై అధికారికంగా మగధీర నిర్మాతలు  స్పందించడంలేదని సమాచారం. ఇక మగధీర లో రాజులు యుద్ధాలు ఎపిసోడ్ కొద్దిసేపే ఉంటుంది. మిగతా అంతా కూడా ఇప్పటికాలంలో నడుస్తుంది.  మరి బాహుబలి లాంటి పూర్తి రాజుల కాలం నాటి సినిమాను ఆదరించిన  జపాన్ ప్రేక్షకులకు మగధీర  నచ్చుతుందో లేదో చూడాలి మరి..  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*