Author Archives: sgr

రైతుగా మారననున్న నాని…!

రైతుగా మారననున్న నాని…!నేచురల్‌ స్టార్‌ నాని రైతు పాత్రలో కనిపించనున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. పలు లఘు చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న కిశోరుడు దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే చిత్రంలో నాని నటిస్తున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల కిశోరుడు నానీని కలిసి సినిమా కథను వినిపించారట. కథ నచ్చడంతో ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ సినిమాలో నాని రైతుగా అభిమానులను అలరించబోతున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. ఇటీవల విడుదలైన ‘దేవదాస్‌’ చిత్రంతో ...

Read More »

విమానం నుంచి కిందపడి పోయిన ఎయిర్‌హోస్టెస్…..!

విమానం నుంచి కిందపడి పోయిన ఎయిర్‌హోస్టెస్…..! ఎయిరిండియా విమానానికి చెందిన ఎయిర్‌హోస్టెస్‌ ప్రమాదవశాత్తు కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది. ఈరోజు అనగా సోమవారం ఉదయం ముంబయి నుంచి  ఢిల్లీకి వెళ్లాల్సిన విమానంలో ప్రయాణికులంతా ఎక్కిన తర్వాత 53ఏళ్ల ఎయిర్‌హోస్టెస్‌ విమానం తలుపు మూయబోతుండగా ప్రమాదవశాత్తు విమానం నుంచి కింద పడిపోయారు.   బోయింగ్‌-777 విమానం తలుపు మూస్తుండగా తమ సిబ్బందిలో ఒకరైన హర్షా లోబో దురదృష్టవశాత్తు కింద పడిపోయారని ఎయిరిండియా ...

Read More »

ప్రశ్నిస్తేనే ఐటీ దాడులా.. అసహనం వ్యక్తం చేస్తున్న బాబు…!

ప్రశ్నిస్తేనే ఐటీ దాడులా.. అసహనం వ్యక్తం చేస్తున్న బాబు…! ప్రకృతి విపత్తులతో ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కోగలుగుతున్నాం కాని.. రాజకీయ కుట్రలు మాత్రం ఇబ్బందిగా మారాయంటున్నారు ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు. సోమవారం ఉదయం నీరు-ప్రగతిపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం అనంతరం తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను సమస్యలు చుట్టముట్టాయని.. వాటిని ధైర్యంగా ఎదుర్కొని అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామన్నారు చంద్రబాబు. కష్టాలకు తోడు ప్రకృతి విపత్తులు ఇబ్బంది పెడుతున్నా పట్టుదలతో వాటిని అధిగమిస్తున్నామన్నారు. అప్పుడు ఓ జాతీయ పార్టీ రాష్ట్రానికి ...

Read More »

తిత్లీ తుఫాను జిల్లాల నష్టం గురించి ప్రధానికి చంద్రబాబు లేఖ

‘తిత్లీ’ బాధితులకు సాయం అందించాలంటూ ప్రధానికి లేఖ, తిత్లీ పెను తుఫాను కలిగించిన బీభత్సంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ వ్రాశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,800 కోట్ల మేర నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం కింద రూ. 1200 కోట్లు విడుదల చేయాలని కోరారు. తిత్లీ తుపాను కారణంగా విద్యుత్‌ రంగానికి రూ.500 కోట్లు, రహదారులు, భవనాల శాఖకు రూ. 100 కోట్లు, పంచాయతీ రాజ్‌ శాఖకు మరో రూ.100 కోట్లు నష్టం వాటిల్లిందని వివరించారు. వ్యవసాయ, ...

Read More »

మళ్ళి పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు…!

  మళ్ళి పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు…! ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను మరోసారి సవరించాయి. దీంతో శనివారం (అక్టోబరు 13) కూడా దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 18 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.82.66 కి చేరింది. డీజిల్ ధర 29 పైసలు పెరిగి రూ.75.19 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 18 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.87.94 కి చేరింది. డీజిల్ ధర 31 పైసలు పెరిగి రూ.78.82 కి చేరింది. కేంద్రం ప్రభుత్వం పెట్రో ధరలపై ...

Read More »

త్రివిక్రమ్ ను మెచ్చుకున్న రాజమౌళి

ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా మొదటిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల నడుమ థియేటర్లో అడుగుపెట్టిన ఈ సినిమా నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా చూసిన దర్శకుడు రాజమౌళి, త్రివిక్రమ్ , ఎన్టీఆర్ ప్రభిభను మెచ్చుకుంటూ ట్విట్ చేశాడు. ‘యుద్ధం తర్వాత ఏమి జరుగుతుంది? అనే పాయింట్ ని బేస్ చేసుకొని సినిమాని ప్రారంభించడమే త్రివిక్రమ్ డేరింగ్ స్టెప్. చాలా బాగా ...

Read More »

వైసీపీ,టీడీపీ టాప్‌ లీడర్లు జనసేనలోకి

వచ్చే ఎన్నికల్లో తొలిసారి పోటీకి రెడీ అవుతున్న జనసేనలోకి ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు జంప్‌ చేస్తున్నారా ? వీరి చేరికకు ముహూర్తం ఖ‌రారు అయ్యిందా? ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు టాప్‌ లీడర్లు జనసేనలో చేరనున్నారా ? అంటే జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీలో సీట్లు రాని వారందరూ జనసేన గూట్లోకి జంప్‌ చేసేస్తున్నారు. నిన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో వైసీపీ ...

Read More »

టీవీల్లోనూ.. సామజిక మాధ్యమాల్లోనూ.. మీ కేసీఆర్‌…!

టీవీల్లోనూ.. సామజిక మాధ్యమాల్లోనూ.. మీ కేసీఆర్‌…!‘నేను మీ కేసీఆర్‌ను’ 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణను సాధించి, మీ ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపాం. సంక్షేమానికి కృషి చేశాం. మళ్లీ ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాం. మరోమారు ఆశీర్వదించండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని ప్రసారమాధ్యమాల్లో కనిపించనున్నారట. కేసీఆరే తమ ఎన్నికల నినాదమని తెరాస నేతలు చెబుతున్నారు. దీనికి వీలుగా గత అయిదు రోజుల్లో పదికి పైగా సందేశాలను సీఎంపై చిత్రీకరించినట్లు తెలిసింది. మూడు, అయిదు నిముషాల నిడివితో ...

Read More »

తండ్రి కొడుకులుగా బాబాయ్ అబ్బాయ్:ఎన్టీఆర్‌ బయోపిక్‌

తండ్రి కొడుకులుగా బాబాయ్ అబ్బాయ్ లు. తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలోని ఒక్కో పాత్రను చిత్ర బృందం అభిమానులకు పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ పాత్రకు సంబంధించి చిత్ర వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. అదే ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి హరికృష్ణ పాత్ర. ఆ పాత్రను ఇప్పుడు హరికృష్ణ తనయుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ ...

Read More »

బీఎల్ఎఫ్ పార్టీలో ఖరారైన అసెంబ్లీ స్థానాలు రెండవ జాబితా విడుదల..

బీఎల్ఎఫ్ పార్టీలో ఖరారైన అసెంబ్లీ స్థానాలు, తెలంగాణ ముందస్తు ఎన్నికలకు బీఎల్ఎఫ్ సమరశంఖం పూరించింది.29 మందితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండవ  జాబితాను ఖరారు చేసింది. బి.ఎల్.ఎఫ్. పార్టీ రెండవ జాబితా విడుదల..   నియోజకవర్గం పేరు                  అభ్యర్ధి పేరు ఎల్.బీ.నగర్                            మామిడి రామచందర్ అంబర్ పేట్              ...

Read More »