Author Archives: sgr

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

  కాంగ్రెస్ 65 మందితో తొలి జాబితా విడుదల, దాదాపు రెండు నెలల నిరీక్షణ తరువాత తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, రాహుల్ గాంధీ మరికొందరు కీలక నేతలు చర్చించిన తర్వాత 65 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. నవంబర్ 12తేదీ రాత్రి ఖచ్చితంగా కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తుందని కుంతియా చెప్పినట్లుగానే రాత్రివరకూ సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల తొలి జాబితాను ...

Read More »

జూబ్లీహిల్స్ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న పెద్దల అంజిబాబు

BLP పార్టీ నేత పెద్దల అంజిబాబు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ బోరబండ డివిజన్లో పాదయాత్ర చేశారు. వారి వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని మీ నాయకుడిగా మీ సేవకై అంకితమై ఉంటానని మాట ఇచ్చారు. వారి అభివృద్ధికై కృషి చేస్తానని తెలిపారు. ఈసారి ప్రజలు కూడా ఇలాంటి నాయకుడు కోసమే ఎదురు చూస్తున్నారు.   SC, ST, BC మైనారిటీ మరియు అగ్రకులాలలోని పేదల అభివృద్ధికై కృషి చేయదలిచానన్నారు. వారి కష్టాలు తీర్చే ప్రజల నాయకుడిగా ఉంటానని.. ప్రతి ...

Read More »

ఈ ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్ చూసి పండగ చేసుకుంటున్న ఫాన్స్…!

ఈ ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్ చూసి పండగ చేసుకుంటున్న ఫాన్స్…!రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా నందమూరి మల్టిస్టారర్ #RRR ఈమధ్యనే లాంచ్ అయింది.  తెలుగులో మల్టిస్టారర్ చిత్రాలు చాలానే వస్తున్నాయిగానీ ఇలా టాప్ లీగ్ స్టార్స్ ఇద్దరు కలిసి నటించే మల్టి స్టారర్ మాత్రం ఇదేనని చెప్పవచ్చు.  ఒకరకంగా ఇది స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఉండే అనారోగ్యకరమైన పోటీని చాలావరకూ తగ్గించే అవకాశం ఉంది. మొదటి నుండి మెగా-నందమూరి ఫ్యాన్స్ మధ్యలో భారీ పోటీ ఉండేది.  #RRR తో అది తగ్గుతుందని ...

Read More »

వచ్చే 12 గంటల్లో ఆంధ్ర.. తమిళనాడుపై గజ తుఫాను ప్రభావం

వచ్చే 12 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుపై గజ తుఫాను ప్రభావం. తిత్లీ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు మంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడి గజ రూపంలో దూసుకొస్తోంది. వచ్చే 12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర వైపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది శ్రీహరి కోటకు 980 కిలోమీటర్లు చెన్నైకు 840 కిలోమీటర్ల దూరంలో ఉంది. బుధవారం చెన్నై నాగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ ప్రభావం తమిళనాడుపై ...

Read More »

బిజేపి సీనియర్ నేత కన్నుమూత

కేంద్రమంత్రి అనంత్ కుమార్ (59) అనారోగ్యముతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న అనంత్‌కుమార్ 1959 జులై 22న కర్ణాటకలో జన్మించారు. ఆయన తొలిసారిగా 1996 సాధారణ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. ఇక 2014 సార్వత్రిక ...

Read More »

కొత్తదనం కోరుకుంటున్న జూబ్లీహిల్స్ ప్రజానీకం

జూబ్లీహిల్స్ ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కొత్తదనమేమిటంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజల సమస్యల్నీ.. అభివృద్ధినీ.. పట్టించుకోకుండా తమ స్వార్థానికి పదవుల్ని ఉపయోగించుకుంటున్నారు. అలా స్వార్థపూరితమైన వారిని కాకుండా ప్రజల కొరకు, ప్రజల సేవకుడిగా.. ప్రజల కోసమే అంకితమై ఉండే ప్రజా నాయకుడిని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.  జూబ్లిహిల్స్ అంటే ధనికుల వర్గం ఉండే ప్రాంతంగా అందరూ భావిస్తారు. కానీ, ఆ నియోజకవర్గంలో అసలు జూబ్లీహిల్స్ ఏరియా మొత్తం లేదు.    మధ్య తరగతి, పేదలు, నిరుపేదలు ఉన్నారు. ముఖ్యంగా ...

Read More »

హైదరాబాద్ టెక్కీలకు ఇంటెల్ సంస్థ గుడ్ న్యూస్

హైదరాబాద్ టెక్కీలకు ఇంటెల్ సంస్థ గుడ్ న్యూస్, సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇంటెల్ సంస్థ హైదరాబాద్ టెక్కీలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇంటెల్ ఇండియా హైదరాబాద్‌లో సాంకేతికాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సాంకేతికాభివృద్ధి కేంద్రంతో 5వేల మందికి ఉపాధిని కల్పించేందుకు సన్నాహాలు చేస్తుంది.  రూ.3వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసే ఈ కేంద్రం ద్వారా తొలి దశలో 1500 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ సంస్థ కోసం ఇంటెల్ భారత శాఖ అధిపతి నివృతిరాయ్ శుక్రవారం ఐటీ శాఖ మంత్రి ...

Read More »

ప్రజలు బిఎల్ఎఫ్ ను ఎంతగానో ఆదరిస్తున్నారంటున్న వీరభద్రం

ప్రజలు బిఎల్ఎఫ్ ను ఎంతగానో ఆదరిస్తున్నారంటున్న వీరభద్రం, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బిఎల్‌ఎఫ్‌) శుక్రవారం మహబూబాబాద్‌లోని గాంధీపార్క్‌ లో బహిరంగసభ నిర్వహించింది. ఈ సభ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ఇన్నాళ్లు పాలించిన పార్టీలు ప్రైవేటు ఆస్పత్రులకు కొమ్ముకాశారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు  ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని తెలిపారు.   తమ బిఎల్ ఎఫ్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. రైతుబంధు లాగానే కూలిబంధు పథకాన్ని ...

Read More »

తెలంగాణలో  ఓటు నమోదుకు నేటితో ముగియనున్న గడువు

తెలంగాణలో  ఓటు నమోదుకు నేటితో ముగియనున్న గడువు,  తెలంగాణ రాష్ట్రంలో ఓటు నమోదుకు నేటితో (నవంబర్ 9) గడువు ముగుయనుంది. ఇప్పటికీ కూడా ఓటు పొందనివారు, జనవరి 1, 2018కి 18 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునేందుకు నేడే ఆఖరి రోజు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకూ ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఫొటో, వయసు ధ్రువీకరణ, చిరునామా తెలిపే గుర్తింపు కార్డులతో మండల కేంద్రాలు, పంచాయితీలు, కలెక్టరేట్ సహాయ కేంద్రాలు, బీఎల్‌వో వద్ద ఓటు నమోదు చేసుకునేందు ...

Read More »

బెల్లంకొండ న్యూ లుక్:’కవచం’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. దీనికి ‘క‌వ‌చం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కాజ‌ల్ క‌థానాయిక‌. ఇందులో బెల్ల‌కొండ ఓ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. క‌థానాయిక‌ని క‌వ‌చంలా ర‌క్షించే బాధ్య‌త క‌థానాయ‌కుడిపై ప‌డుతుంది. అందుకే.. ‘క‌వ‌చం’ అనే టైటిల్ నిర్దారించార్ట‌. మెహ‌రీన్ మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.నీల్ నితిన్ ముఖేష్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ని పోషిస్తున్నాడు. డిసెంబ‌రులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అతి త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది. యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ...

Read More »