Author Archives: sgr

పెళ్ళి పీఠలెక్కబోతోన్న అమీ జాక్సన్‌

పెళ్ళి పీఠలెక్కబోతోన్న అమీ జాక్సన్.. అందాల కథానాయిక అమీ జాక్సన్‌ త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటో, అమీ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. న్యూఇయర్‌ సందర్భంగా జాంబియాలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని అమీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. జనవరి 1 2019 మన జీవితాల్లో కొత్త ప్రయాణం. ఐ లవ్యూ. నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు అని పేర్కొంటూ ఫొటోను పోస్ట్‌ చేశారు. కాగా.. పెళ్లెప్పుడన్న విషయాన్ని మాత్రం అమీ వెల్లడించలేదు. తెలుగులో ఎవడు, ...

Read More »

పీఎం హౌసింగ్ స్కీమ్ లో శ్రీరాముడికి ఇంటిని కల్పించండి

పీఎం హౌసింగ్ స్కీమ్ లో శ్రీరాముడికి ఇంటిని కల్పించండి. అయోధ్యలో రామమందిరం నిర్మించాలంటూ ఒక వర్గం మసీదు కోసం మరోవర్గం మధ్యేమార్గాన్ని సూచిస్తూ కోర్టులు ఇలా చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెడుతూ బీజేపీ ఎంపీ ఒకరు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అయోధ్య రాముడికి ఇల్లు కల్పించాలని కోరుతూ అయోధ్య జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఘోసి ఎంపీ హరి నారాయణ రాజ్‌భర్. “రాముడు టెంట్‌లో ఉంటున్నాడు గూడు కల్పించండి” అని లేఖలో పేర్కొన్నారు. ...

Read More »

అమెరికాలో నల్గొండ జిల్లా కుటుంబ సభ్యులు ముగ్గురు దుర్మరణం

అమెరికాలో నల్గొండ జిల్లా కుటుంబ సభ్యులు ముగ్గురు దుర్మరణం. క్రిస్మస్‌ సంబరాల్లో నిమగ్నమైన ముగ్గురు భారతీయ విద్యార్థులు అమెరికాలోని టెనసీ శివార్లలోని మెమ్ఫిస్‌ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. వారంతా నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్‌నాయక్‌, సుజాత దంపతుల పిల్లలే కావడంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాదం అలముకుంది. గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్‌నాయక్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కేతావత్‌ సాత్విక నాయక్‌ (16), కేతావత్‌ జయ సుచిత్‌ (13), కుమారుడు సుహాన్‌ నాయక్‌ (14) ఉన్నారు. ప్రస్తుతం ...

Read More »

మైలవరంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన

మైలవరంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన.. పదేళ్ల కడప జిల్లా వాసుల కల నెరవేరింది. దాదాపు లక్ష మందికి ఉపాధినిచ్చే రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు పునాదిరాయి ఈరోజు పడింది. గురువారం ఉదయం మైలవరం మండలం కంబాలదిన్నెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2700 ఎకరాల్లో రూ.18వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ నిర్మాణం జరుగనుంది. ఈ సందర్బంగా బాబు మాట్లాడుతూ ఈ పరిశ్రమ ...

Read More »

కేసీఆర్ ఎంపీగా పోటీ ఎక్కడి నుంచో తెలుసా…!

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు మంత్రివర్గాన్ని కూడా పూర్తి స్తాయిలో విస్తరించకుండా దేశం బాట పట్టారు. ఒరిస్సా నుంచి మొదలైన ఆయన ప్రస్తానం బెంగాల్ మీదుగా ఢిల్లీ చేరింది. ఫ్రంట్ కు ప్రాంతీయ పార్టీలను కూడగట్టే దిశగా కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతోనేనట.  అసెంబ్లీలో విజయం సాధించి పార్లమెంట్ సీట్లను ...

Read More »

కేసీఆర్ నిర్ణయం మీద ఉద్యోగుల్లో భయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త‌న‌దైన స్టైల్ లో  హామీలను  కీల‌క వ‌ర్గాల్లో భయం సృష్టిస్తున్నారు. పార్టీ అధికారంలోకి  వస్తే  తమ మేనిఫెస్టోలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతామని కేసీఆర్ గారు  అన్నారు. ఇప్పుడు  పార్టీ  అధికారంలోకి  వచ్చింది . మరి ఉద్యోగులు ఎందుకు  భయం  అంటే డిసెంబర్ మాసంలో పదవీ విరమణ చేయాలి . ఉద్యోగుల పదవీ విరమణ వయ్ససును 58 నుండి 60 ఏళ్లకు పెంచాలనే దానిపై ప్రభుత్వం పలు ఆలోచనలు చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ...

Read More »

సూరి హత్యకేసులో కీలక మలుపు…!

సూరి హత్య కేసులోకీలక మలుపు…!ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్దెల చెరువు సూరి ప్రధాన హత్య కేసులో నాంపల్లి కోర్టుతుది తీర్పుని జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుభానుకిరణ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రెండో నిందితుడు మన్మోహన్‌ కు ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో మరో నలుగురునిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. సూరి హత్య కేసులో గతఆరున్నరేళ్ళుగా భానుకిరణ్‌ చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. కాగా, మన్మోహన్‌కూడా జైలులో ఎనిమిదేళ్లుగా రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. భానుకిరణ్‌కు యావజ్జీవం, మన్మోహన్‌కుఐదేళ్లు జైలు శిక్ష విధించిన న్యాయస్థానం ...

Read More »

కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకిన పెథాయ్ తుఫాన్

కాట్రేనికోన వద్దతీరాన్ని తాకిన పెథాయ్ తుఫాను.. ఉత్తరాంధ్ర ప్రజలను భయభ్రాంతులకుగురిచేస్తున్న పెథాయ్ తుఫాను కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది. అమలాపురంకి 20 కిలోమీటర్ల దూరంలో పెథాయ్ తుఫాను తీరాన్ని తాకండంతో ఆ ప్రాంతాల్లో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫానుకారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, ఖాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో మరో గంటలో కుండపోత వర్షాలు ...

Read More »