జూబ్లీహిల్స్ BLP పార్టీ MLA అభ్యర్ధి ప్రచార వాహనంపై రాళ్ళతో దాడి…!

జూబ్లీహిల్స్ BLP పార్టీ MLA అభ్యర్ధి ప్రచార వాహనంపై రాళ్ళతో దాడి…!ప్రశాంతంగా జరగవలసిన ఎన్నికల ప్రచారాలు రక్తాన్ని చవిచూస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గలో BLP పార్టీ MLA అభ్యర్ధిగా పెద్దల అంజిబాబు పోటి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం ఆయన ప్రచారంలో భాగంగా యూసఫ్ గూడ బస్తీకి వెళ్ళడం జరిగింది, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెద్దల అంజిబాబు ప్రచార వాహనం పై మరియి కళాకారులపై రాళ్ళతో దాడి చేయడం అందరిలో కలకలాన్ని రేపింది. ఈ ఘటనలో ఒక కళాకారుడికి తీవ్రంగా గాయాలు అయినట్లు సమాచారం.

 

తమపై జరిగిన దాడిని ఖండిస్తూ పెద్దల అంజిబాబు మరియు ఇతర కార్యకర్తలు రాస్తారోకో చేశారు.  దాడి చేసిన దుండగులపై తగిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ ఏసీపి, జూబ్లీహిల్స్ సీఐ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాము అని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. గాయపడిన కళాకారుడిని ఉస్మానియా హాస్పిటల్ లో చేర్చినట్లు సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*