ఢిల్లీ సెక్రటేరియట్‌లో సీఎం కెజ్రీవాల్ పై కారంపొడితో దాడి…!

ఢిల్లీ సెక్రటేరియట్‌లో సీఎం క్రేజీవాల్ పై కారంపొడితో దాడి…!ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దారుణమైన దాడి జరిగింది. సీఎం ముఖంపై ఓ వ్యక్తి కారంపొడితో దాడి చేశాడు. కేజ్రీవాల్‌ను చంపేస్తానంటూ గట్టిగా అరిచాడు. తోపులాటలో కేజ్రీవాల్ కళ్లజోడు నేలపై పడిపోయింది. ఢిల్లీ సెక్రటేరియట్‌లోని మూడో అంతస్తులో మంగళవారం(నవంబర్ 20) మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. సీఎంపై అనూహ్యమైన దాడి ఢిల్లీలో కలకలం రేపింది. దాడికి పాల్పడ్డ నిందితుడిని అనిల్ కుమార్‌గా గుర్తించారు. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.  అరవింద్ కేజ్రీవాల్ మధ్యాహ్న భోజనానికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. నిందితుడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సెక్రటేరియట్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు.

 

 

సెక్రటేరియట్ మూడో ఫ్లోర్‌లో కేజ్రీవాల్ కార్యాలయం బయట వేచి చూసిన నిందితుడు ఆయన బయటకి రాగానే కారంపొడితో ఒక్కసారిగా దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామానికి సీఎం షాక్ తిన్నారు. నిందితుడు అనిల్ కుమార్ ఓ సిగరెట్ పెట్టెలో కారంపొడిని తీసుకొని సెక్రటేరియట్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. అతడు ఈ దాడి చేయడానికి కారణాలు తెలియాల్సి ఉంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సెక్రటేరియట్‌లో సాక్షాత్తూ సీఎంపైనే దాడి జరగడం అందరికీ సంచలనంగా మారింది. ఇది కచ్చితంగా ఢిల్లీ పోలీసుల వైఫల్యమేనని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మండిపడ్డారు.

 

దీన్ని ప్రమాదకరమైన దాడిగా పేర్కొన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే ఎలా అని ట్విటర్ ద్వారా వారు ప్రశ్నించారు. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారో కనుక్కోవాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ (50)పై దాడి జరగడం ఇదే తొలిసారేం కాదు. గతంలో ఆయనపై ఓ వ్యక్తి ఇంక్ చల్లాడు. మరో నిందితుడు ఆయన చెంప మీద కొట్టడానికి ప్రయత్నించాడు. ప్రభుత్వం పోలీసులను ఇలాంటివి జరగకుడా చూస్కోవాలని హెచ్చరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*