‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా రివ్యూ మరియు రేటింగ్

సినిమా పేరు   : ‘అరవింద సమేత వీర రాఘవ’

నటి నటులు   : యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే,ఈషా రెబ్బ,సునీల్,జగపతి బాబు

బ్యానర్‌           : హారిక అండ్ హాసిని క్రియేషన్స్

దర్శకత్వం     : త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాత         : ఎస్.రాథాకృష్ణ

సంగీతం        : తమన్  

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై యంగ్ టైగర్ ఎన్టీఆర్  హీరోగా పూజా హెగ్డే మరియు ఈషా రెబ్బ హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ గురువారం రోజు ప్రేక్షకుల ముందుకచ్చింది. ప్రముఖ నిర్మాత ఎస్.రాథాకృష్ణ ఈ సినిమాని నిర్మించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. మరి ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ‘అరవింద సమేత వీర రాఘవ’  ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ….

‘అరవింద సమేత వీర రాఘవ’ నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ. నల్లగుడి ఊరి పెద్ద బసి రెడ్డి(జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). ఓ చిన్న గొడవ కారణంగా రెండు గ్రామాల మధ్య వైరం మొదలయి 30 ఏళ్ల పాటు ఊళ్లను నాశనం చేస్తాయి. 12 ఏళ‍్ల పాటు లండన్‌లో ఉన్న నారపరెడ్డి కుమారుడు వీర రాఘవ రెడ్డి(ఎన్టీఆర్‌) ఊరికి తిరిగి వస్తాడు. కొడుకును ఇంటికి తీసుకెళ్తుండగా బసిరెడ్డి మనుషులు దాడి చేసి నారప రెడ్డిని చంపేస్తారు. వీర రాఘవ రెడ్డి తిరగబడి అందరినీ నరికేస్తాడు. కాని తరువాత భామ్మ మాటలతో ఊరి జనాలను మార్చాలని, ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని హైదరాబాద్‌ వెళ్లిపోతాడు. అక్కడే అరవింద(పూజా హెగ్డే) తో ప్రేమలో పడతాడు.అరవిందను ఓ ప్రమాదం నుంచి కాపాడటంతో కథ మలుపు తిరుగుతుంది. అరవింద సాయంతో రెండు గ్రామాల మధ్య గొడవలను, కక్షలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో వీర రాఘవకు ఎదురైన సమస్యలేంటి..? అన్నదే మిగతా కథ.

ఎవరెలా చేశారంటే..

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వీర రాఘవ పాత్రలో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. సినిమా అంతా తారక్ తన భుజాన వేసుకుని నడిపించాడు. త్రివిక్రం పెన్ పవర్ కు ఎన్.టి.ఆర్ నటన తోడైతే ఎలా ఉంటుందో దానికి తగినట్టుగా సినిమా ఉంది. ఇక హీరోయిన్ పూజా హెగ్దె కూడా మెప్పించింది. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. సినిమాలో మరో హీరోయిన్ ఈషా రెబ్బ కూడా అలరించింది. సునీల్ చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీతో మెప్పించాడు. సినిమాలో సునీల్ పాత్ర బాగుంది. జగపతి బాబు విలనిజం గూస్ బమ్స్ తెప్పిస్తుంది. ఏ పాత్రనైనా అలవోకగా చేయడంలో తనకు సాటే అనిపించాడు జేబి. ఇక నవీన్ చంద్ర కూడా విలన్ కొడుకు పాత్రలో మెప్పించాడు.తండ్రి – కొడుకు మధ్య అనురాగం, ప్రేమ వంటి సన్నివేశాలు గుండెలను బరువెక్కిస్తాయి. ఆ సన్నివేశాల్లో ఎన్టీఆర్ హావభావాలు మూవీకి హైలెట్. కత్తి పట్టినోడు కాదు.. ఆ కత్తిని ఎత్తకుండా సమస్యను పరిష్కరించినోడు మనిషి, పగ పెంచుకుంటే ఒంటరి అవుతాం.. ప్రేమ పంచుకుంటే జగమంతా దాసోహం అవుతుంది.. ఎన్నాళ్లు బతికాం అన్నది కాదు.. బతికిన 40 ఏళ్లు.. నాలుగు తరాలు గుర్తుండిపోయేలా ఉండాలి అనే ఎమోషనల్ డైలాగ్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి 

ప్లస్ పాయింట్స్..

కమర్షియల్ ఫార్మాట్ లోనే దర్శకుడు కథను నడిపిస్తాడు. కాకపోతే తారక్ కలయికతో  త్రివిక్రమ్ మ్యానియాను కరెక్ట్ గా చూపించాడని చెప్పవచ్చు. కథ కుడా తారక్ కు కరెక్ట్ గా సెట్టయ్యింది. థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కెమెరా పనితనం యాక్షన్ సన్నివేశాలు త్రివిక్రమ్ ఎమోషనల్ డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. రామ్ రుధిరం సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో పిలాసఫికల్ గా సందేశాన్ని చెప్పడం సినిమాలో మెయిన్ హైలెట్. 

మైనస్ పాయింట్స్..

అయితే ఆయన నుంచి ఆశించే కామెడీ ట్రాక్ సినిమాలో కనిపించదు. అలాంటి స్పెస్ కూడా కథలో లేదనిపిస్తుంది.

చివరిగా..

ఫైనల్ గా అరవింద సమేత ఈ దసరా ఫెస్టివల్ లో ఒక మంచి యాక్షన్ ఎండ్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. కానీ ముఖ్యంగా ఫ్యాన్స్ కి సినిమా ఎక్కువగా నచ్చుతుంది. 100శాతం ప్యామిలీ ఎంటర్ టైనర్ గా సాగుతుంది మూవీ. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ హాయిగా మూవీ చూడొచ్చు. కథ అంతర్లీనంగా ఉండే కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని.. ఎన్టీఆర్ చెప్పించటంలో 100శాతం సక్సెస్ అవుతాడు దర్శకుడు.

Web2look Rating : 3/5

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*