‘అరవింద సమేత’ మూవీ ప్రీ రివ్యూ మరియు రేటింగ్

సినిమా పేరు   : ‘అరవింద సమేత వీర రాఘవ’

నటి నటులు   : యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే,సునీల్,జగపతి బాబు

బ్యానర్‌           : హారిక అండ్ హాసిని క్రియేషన్స్

దర్శకత్వం     : త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాత         : ఎస్.రాథాకృష్ణ

సంగీతం        : తమన్  

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాథాకృష్ణ(చినబాబు) నిర్మించారు. భారీ అంచనాల నడుమ దసరా సందర్భంగా అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఎన్టీఆర్ అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సినిమా ఎలా ఉంటుందో అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే యంగ్ టైగర్ అభిమానులకు శుభవార్త వచ్చేసింది. 

దుబాయ్‌లో ఉంటూ టాలీవుడ్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ విమర్శకుడు ఉమైర్ సంధు గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటికే ఆయన చాలా తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు ‘అరవింద సమేత’ రివ్యూను కూడా ఇచ్చేశారు. మంగళవారం యూఏఈ సెన్సార్ సభ్యులతో కలిసి సినిమా చూసిన ఆయన.. అనంతరం రివ్యూను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ప్రధాన బలం ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. వీర రాఘవరెడ్డి పాత్రను ఎన్టీఆర్ బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుందని కొనియాడారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన నటన అద్భుతమంటూ ప్రశంసించారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, డైలాగులు చెప్పే విధానం పీక్స్ అని చెప్పుకొచ్చారు. 

ఎన్టీఆర్ స్టైలిష్ లుక్, మాస్ స్టోరీ, చప్పట్లు కొట్టించే డైలాగులు, అత్యంత శక్తివంతమైన క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్రధాన బలాలని ఉమైర్ సంధు పేర్కొన్నారు. యంగ్ టైగర్ అభిమానులకు ఇది మరో ఎమోషనల్ బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్ కాబోతోందన్నారు. ఈ దసరాకు ఫర్‌ఫెక్ట్ గిఫ్ట్ అని తెలిపారు. అయితే సంధు తన రివ్యూలో కేవలం ఎన్టీఆర్ పాత్రధారణ, ఆయన బలం గురించి మాత్రమే ప్రస్తావించారు. కథ గురించి కానీ, నేపథ్య సంగీతం గురించి కానీ ఎక్కడా చెప్పలేదు. మొత్తం మీద నాలుగు స్టార్లు అయితే ఇచ్చారు. 

ఇదిలా ఉంటే, తెలుగు సినిమాలకు ఉమైర్ సంధు నాలుగు స్టార్లు ఇవ్వడం కొత్తేమీ కాదు. చాలా సినిమాలకు ఆయన ఇదే రేటింగ్ ఇచ్చారు. వాటిలో కొన్ని హిట్లు కాగా.. కొన్ని డిజాస్టర్లయ్యాయి. ‘స్పైడర్’, ‘నా పేరు సూర్య’ సినిమాలకు కూడా ఈయన నాలుగు స్టార్లు ఇచ్చారు. ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయో మీకు తెలుసు. కానీ ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ సినిమాలకు సంధు ఇచ్చిన రేటింగ్ నిజమైంది. మరి ‘అరవింద సమేత’ ఏమవుతుందో చూడాలి! 

Web2look Rating :3.75/5

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*