ఫోన్ నంబర్‌ కనుక్కుని మరీ ఆయనకు వేల సంఖ్యలో అభినందనలు తెలుపుతున్న యూత్……ఎవరో తెలిస్తే షాక్………!

తాజాగా ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రేమగీతం రాలేదనే చెప్పాలి. అందుకే ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే… నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే.. అనే గీతా గోవిందం లోని ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఏ నోట విన్నా ఇదే పాట. ముఖ్యంగా యూత్ ఈ సాంగ్‌ను రిపీట్‌ గా వింటూ పాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్,  వాట్సాప్‌లలో ఎక్కడ చూసిన ఈ సాంగ్ గురించే అంతా మాట్లాడుతున్నారు. ఇక లవర్స్ ఐతే ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే’ అంటూ ఈ ప్రేమగీతంలో మునిగి తేలుతున్నారు. ఈ పాట  అంతలా యూత్‌లో క్రేజీ సాంగ్‌గా మారింది. ఇంత ప్రత్యేకమైన ఆదరణను పొందుతున్న ఈ సాంగ్ ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా జూలై 10న రిలీజైంది.

విడుదలైన ఆరు రోజుల్లో కేవలం ఒక్క యూట్యూబ్ లో మాత్రమే 82 లక్షల మందికి పైగా ఈ సాంగ్ టీజర్‌ను చూశారంటే ‘గీతా గోవిందం’ లిరికల్ సాంగ్ సునామీ ఎలా ఉందో వర్ణించలేము. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాస్‌ నిర్మిస్తోన్న ‘గీతాగోవిందం’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. యువ సంగీత దర్శకులు గోపీ సుందర్ మధురమైన స్వరాలను సమకూర్చగా, అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ పాట రచయిత అనంత్ శ్రీరామ్ ఫోన్ నంబర్‌ను కనుక్కుని మరీ ఆయనకు వేల సంఖ్యలో అభినందనలు తెలుపుతూ యూత్‌ నుండి మెసేజ్‌లు వెల్లువలా వస్తున్నాయంటే, యూత్‌లో ఈ సాంగ్‌కి ఉన్న క్రేజ్ ఏంటో వర్ణనాతీతం. గీతాగోవిందం సాంగ్ యూట్యూబ్‌లో టాప్ లిస్ట్ లో ఉండటంతో ఈ గీతం రచయిత తన అనుభవాల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఏ సందర్భాన్ని బట్టి ఈ గీతం రాయాల్సి వచ్చిందో వివరించారు.

మనం చీకట్లో ఎన్నో కలలు కంటుంటాం. ఆ చీకట్లో కనే కలలు నిజం కావచ్చు కాకపోవచ్చుకానీ తాను కలలు కన్న ప్రేయసి తన ఎదురుగా ఉంది. కాబట్టి తన కలలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. తనను కలవాలని, తనతో కలిసి ఉండాలని చీకట్లో కన్న కలలు ఇప్పటి వరకూ నిజం కాకుండా ఉన్నాయి. కాని ఒక్కసారిగా ఆమె ఎదురు పడి ఆ కన్న కలలు నిజం అవ్వడంతో అతడు చీకట్లో కన్న కలలు వెలుగులోకి వచ్చాయి. అనుకోని పరిస్థితుల వల్ల ఇద్దరు ప్రేమికులు విడిపోయి మళ్లీ కలిసిన సందర్భంలో వచ్చే పాటనే ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే…’. మనం కోరుకున్నది దక్కినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఇంకేం కావాలే అనిపిస్తుంది. అదే ఈ పాటకి పల్లవి అంటూ పాటను పాడి వినిపించారు అనంత్ శ్రీరామ్. ఇలా మరెన్నో పాటలతో అలరించాలని యూత్ అందరూ కోరుకుంటునారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*