‘సాహో’లో ప్రభాస్ పక్కన ఛాన్స్ దక్కించుకున్న యాడ్స్ మోడల్…!

‘సాహో’లో ప్రభాస్ పక్కన ఛాన్స్ దక్కించుకున్న యాడ్స్ మోడల్…! ఈమధ్య బుల్లి తెరపై ఎయిర్ టెల్ యాడ్స్ తో తెగ పాపులర్ అయిన అమ్మాయి సాషా చెత్రీ. యూత్ ఆడియన్స్ ను 4G అంటూ  విపరీతంగా ఆకట్టుకుని ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. ఎప్పుడైతే ఎయిర్ టెల్ యాడ్స్ లో చేసే అవకాశం వచ్చిందో ఈమెకు స్టార్ హీరోయిన్ స్థాయి గుర్తింపు దక్కింది. బాలీవుడ్ తో పాటు అన్ని భాషల నుండి కూడా ఈమెకు ఛాన్స్ వస్తున్నాయి. తెలుగులో ఈమెకు అడవి సాయి కిరణ్ మొదటి ఛాన్స్ ను ఇచ్చాడు. తెలుగులో ఈమెను నటింపజేసేందుకు ఆయన చాలా కష్టపడ్డాడు. మొదటి సినిమా విడుదల కాకుండానే మరో సినిమాలో ఈమెకు ఛాన్స్ వచ్చింది. ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ‘సాహో’ చిత్రంలో ఒక కీలక పాత్రలో సాషా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రభాస్ కు జోడీగా ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

 

బాలీవుడ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ కనిపించబోతున్న ఈ చిత్రంలో సాషాను కూడా ఎంపిక చేయడంతో హిందీ ప్రేక్షకులను మరింతగా ఆకర్షించవచ్చు అని దర్శకుడు సుజీత్ అనుకుంటున్నట్లుగా సమాచారం అందింది.
దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఛాన్స్ అనగానే అసలు పాత్ర గురించి ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పిందట. సాషా చెత్రీ హీరోయిన్ గా కూడా ప్రయత్నాలు చేస్తోంది. సాహో సక్సెస్ అయితే సాషాకు నటిగా మంచి బ్రేక్ రావడం ఖాయం అంటున్నారు. సాహో చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 4G భామ ఏ మాత్రం సక్సెస్ అవుతుందో చూడాలి మరీ…!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*