సముద్రంలోకి దూసుకెళ్ళిన విమానం.. కానీ అందరూ సేఫ్.. అద్భుతం….!

సముద్రంలోకి దూసుకెళ్ళిన విమానం.. కానీ అందరూ సేఫ్.. అద్భుతం….! ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన విమానం సముద్రంలోకి దూసుకెళ్లింది. పట్టుతప్పి సముంద్రంలోనే ల్యాండ్ అయ్యింది. కానీ అద్భుతం జరిగింది. అందులోని ప్రయాణికులెవ్వరికీ ఏం కాలేదు. 36మంది ప్రయాణికులు, 11మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.  ఈ అద్భుతం ఇండోనేషియాకు సమీపంలోని పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న మైక్రోనేషియన్ దీవుల సమీపంలో చోటు చేసుకుంది. పసిఫిక్ మహా సముద్రంలోని నుగిని దేశానికి చెందిన విమానం వీనో ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవ్వాల్సింది. అయితే రన్ వే పై దిగకుండా పట్టు తప్పి మరో 150 మీటర్లు ముందుకు దూసుకెళ్లి పక్కనే ఉన్న సముద్రంలో దిగిపోయింది.

 

విమానం ప్రమాదానికి గురైందని గమనించిన  అక్కడే ఉన్న మత్య్సకారులంతా  వెంటనే బోట్లతో వెళ్లి విమానంలోని ప్రయాణికులను కాపాడారు. విమానంలో ఉన్న మొత్తం 47మందిని సురక్షితంగా బోట్ల సహాయంతో కాపాడారు. సముద్రంలోతు అక్కడ తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైగా ల్యాండ్ అవ్వగానే విమానం మునగకుండా తేలి ఉండడం కూడా ప్రాణ నష్టం జరగకుండా కాపాడింది. అయితే విమానం రన్ వే పై కాకుండా పక్కనే ఉన్న సముద్రంలోకి ఎందుకు దూసుకెళ్లిందనడానికి గల కారణాలు తెలియరాలేదు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*