విమానం నుంచి కిందపడి పోయిన ఎయిర్‌హోస్టెస్…..!

విమానం నుంచి కిందపడి పోయిన ఎయిర్‌హోస్టెస్…..! ఎయిరిండియా విమానానికి చెందిన ఎయిర్‌హోస్టెస్‌ ప్రమాదవశాత్తు కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది. ఈరోజు అనగా సోమవారం ఉదయం ముంబయి నుంచి  ఢిల్లీకి వెళ్లాల్సిన విమానంలో ప్రయాణికులంతా ఎక్కిన తర్వాత 53ఏళ్ల ఎయిర్‌హోస్టెస్‌ విమానం తలుపు మూయబోతుండగా ప్రమాదవశాత్తు విమానం నుంచి కింద పడిపోయారు.

 

బోయింగ్‌-777 విమానం తలుపు మూస్తుండగా తమ సిబ్బందిలో ఒకరైన హర్షా లోబో దురదృష్టవశాత్తు కింద పడిపోయారని ఎయిరిండియా వెల్లడించింది. ఆమె కాళ్లకు తీవ్ర గాయాలవ్వడంతో నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించింది.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*