టీడీపీ తరపున ఎంపీలు ఖరారు.. త్వరలో ప్రకటించనున్న చంద్రబాబు!

టీడీపీ తరపున ఎంపీలు ఖరారు.. త్వరలో ప్రకటించనున్న చంద్రబాబు! తెదేపా పార్టీ ఎన్నిక‌ల్లో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌డంతో పాటు అభ్య‌ర్థులు ఎంపిక‌లో వేగం పెంచింది. శాస‌న‌స‌భ అభ్య‌ర్ధుల ఎంపిక‌ను అదికారిక తెదేపా పార్టీ దాదాపుగా ఖ‌రారు అయ్యినట్లే. అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా తెలుగుదేశం లోక్ స‌భ అభ్య‌ర్థుల జాబితా దాదాపు ఖ‌రారు చేసింది టీడీపి. ఇందులో కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర సంఘ‌ట‌న‌లు సైతం లేక‌పోలేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎంపీ అభ్య‌ర్థుల్లో సగం మంది మారిపోవ‌డం విశేషం. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఎంపీల్లో స‌గం మంది త‌మ సీటు ఖాళీ చేస్తుండ‌గా, అక్క‌డ తెలుగుదేశం త‌ర‌ఫున కొత్త ముఖాలు క‌నిపిస్తున్నాయి.

పాత అభ్యర్థుల్లో ముగ్గురు మాత్రం స్వ‌తంత్రంగా పోటీ నుంచి త‌ప్పుకున్నట్లు సమాచారం. అందులో కాకినాడ ఎంపీ తోట న‌ర్సింహం, రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్‌, అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి పోటీలో లేరు. ఇద్ద‌రు ఎంపీలు అవంతి శ్రీ‌నివాస్‌, ర‌వీంద్ర‌బాబు పార్టీలు మారిపోయారు. న‌ర‌స‌రావు పేట‌, బాప‌ట్ల పెండింగ్‌లో ఉన్నాయి. బాప‌ట్ల అభ్య‌ర్థి మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక స్థానాల వారిగా అభ్య‌ర్థులు ఎవ‌రో చూద్దాం:- 1.శ్రీ‌కాకుళం – కె.రామ్మోహ‌న్ నాయుడు (పాత‌ అభ్యర్థి). 2.విజ‌య‌న‌గ‌రం – పి.అశోక‌గ‌జ‌ప‌తి రాజు (పాత‌ అభ్యర్థి). 3.విశాఖ‌ప‌ట్నం – శ్రీ‌భ‌ర‌త్ (కొత్త‌ అభ్యర్థి).4.అనకాప‌ల్లి – అడారి ఆనంద్ (కొత్త‌ అభ్యర్థి). 5.అర‌కు – వి కిషోర్ చంద్ర‌దేవ్ (కొత్త‌ అభ్యర్థి). 6.కాకినాడ‌- చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ (కొత్త‌ అభ్యర్థి). 7.అమ‌లాపురం – జి.హ‌రీష్ మాథుర్ (కొత్త‌ అభ్యర్థి). 8.ఏలూరు – మాగంటి వెంక‌టేశ్వ‌ర‌రావు (పాత‌ అభ్యర్థి). 9.మ‌చిలీప‌ట్నం – కొన‌క‌ళ్ల నారాయ‌ణ (పాత‌ అభ్యర్థి). 10. విజ‌య‌వాడ – కేశినేని నాని (పాత‌ అభ్యర్థి). 11.గుంటూరు – గ‌ల్లా జ‌య‌దేవ్ (పాత‌ అభ్యర్థి). 12.బాప‌ట్ల – డొక్కా మాణిక్యం (కొత్త‌ అభ్యర్థి). 13.ఒంగోలు – ఎంఎం కొండ‌య్య (కొత్త‌ అభ్యర్థి). 14.క‌ర్నూలు – కోట్ల సూర్య ప్ర‌కాష్ రెడ్డి (కొత్త‌ అభ్యర్థి). 15.అనంత‌పురం – జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డి (కొత్త‌ అభ్యర్థి). 16.హిందూపురం – నిమ్మ‌ల కిష్ట‌ప్ప (పాత‌ అభ్యర్థి). మ‌రి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంకా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారుచేసే ప‌నిలో ఉన్నారు. బుధ‌వారం లోపు అవి కూడా పూర్త‌వుతాయని పార్టీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.  కాగా అధికార ప్రకటన రావాల్సిఉంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*