పింక్ డ్రస్ లో ప్రియాంక వయసుని నమ్మడం కష్టమేమో……..!

హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న భారతీయ నటిగా  ప్రియాంక చోప్రా ఇమేజ్ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది.  హాలీవుడ్ సినిమా షూటింగును పూర్తి చేసుకుంది ప్రియాంక చోప్రా. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రియాంక స్టిల్స్ కొన్ని ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. టీవీ సీరిస్‌ల కోసం, సినిమాల కోసం అమెరికాకు మకాం మార్చిన ప్రియాంక అక్కడే ప్రియుడుని కూడా వెదుక్కొంది.

అతను ఎవరో కాదు హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్ జోనస్‌తో ప్రియాంక ప్రేమాయణాన్ని నడుపుతోందనే ప్రచారం బాగా సాగుతోంది. అయితే ఈ  ప్రేమ వ్యవహారంపై ప్రియాంక పూర్తి వివరణ ఇవ్వడం లేదు. అయితే వీరిద్దరి పెళ్లి ఖాయమైందనే ప్రచారం మాత్రం కొనసాగుతోంది. అభిమానుల నుంచి పింక్ డ్రస్‌లో ప్రియాంక ఫొటోలపై పొగడ్తల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 35 సంవత్సరాలు. ఈ ఫోజులు చూస్తే ప్రియాంకకు అంత వయసుందంటే నమ్మడం కష్టమేమో!. ఈమె తన అందచందాలతో హాలివుడ్ ప్రేక్షకులను అలరించిద్దేమో చూడాలి మరి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*