వరుసగా 4, 5 రోజులు బ్యాంక్ కి సెలవులు…!

 

వరుసగా 4, 5 రోజులు బ్యాంక్ కి సెలవులు…!బ్యాంకుల్లో ఏవైనా పనులుంటే తక్షణమే పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ వారంలో మిగిలిన ఆరు రోజుల్లో 4 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు. ఇంకా చెప్పాలంటే.. మంగళవారం(నవంబర్ 20) మినహాయిస్తే ఒక గురువారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. ఆ రోజు కూడా కుదరకపోతే ఇంక సోమవారం వరకు ఆగాల్సి వస్తుంది. ఏటీఎంలలోనూ నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉందట. సరిపడేంత నగదు విత్‌డ్రా చేసుకొని పెట్టుకోవడం ఉత్తమం. బుధ, శుక్ర, శనివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. బుధవారం(నవంబరు 21) ఈద్‌-ఇ-మిలాద్‌-ఉల్‌-నబీ కాగా, శుక్రవారం(నవంబరు 23) గురునానక్‌ జయంతితో పాటు కార్తీక పౌర్ణమి కూడా ఉంది.

 

 

ఇక వారాంతరమైన 24, 25 తేదీలు ఎలాగూ నాలుగో శనివారం, ఆదివారం సెలవు దినాలనే విషయం తెలిసిందే. దీంతో జనం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అయితే శుక్రవారం మాత్రం కొన్ని ప్రైవేట్ బ్యాంకులు పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, రాంచీ, రాయ్‌పూర్‌, శ్రీనగర్‌, డెహ్రాడూన్‌, జమ్మూల్లో బుధ, శుక్ర, శనివారాలు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక భోపాల్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నై నగరాల్లోని బ్యాంకులకు కేవలం బుధ, శనివారాల్లో మాత్రమే సెలవులు ఇచ్చారు. 

ఏదేమైనా నేరుగా బ్యాంకుల్లో ఏదైనా పని ఉన్నవారు మంగళవారం సాయంత్రంలోగా పూర్తి చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే 26వ తేదీ వరకు ఆగాల్సిందే. ఏటీఎంలలో నగదు కొరత ప్రమాదం.. మరోవైపు ఆన్‌లైన్, డిజిటల్ లావాదేవీలు యథావిథిగా కొనసాగినా.. వరస సెలవులతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడవచ్చు. అందువల్ల డబ్బు అవసరమున్నవారు ముందుగానే విత్‌డ్రా చేసి పెట్టుకోవడం మంచింది. త్వరపడండి మరి…!  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*